US Tariffs: భారత్‌పై 25% శాతం సుంకాలు తగ్గించాలని అమెరికాను కోరిన జీటీఆర్‌ఐ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌పై అమల్లో ఉన్న 25% దిగుమతి సుంకాలను తగ్గించాలని అమెరికాను కోరుతూ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) విజ్ఞప్తి చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారతం తగ్గించినప్పటికీ, అమెరికా తమ వస్తువులపై టారిఫ్‌లను కొనసాగించడం న్యాయం కాదని సంస్థ అభిప్రాయపడింది. రష్యా చమురు దిగుమతులు భారత్ భారీగా తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రస్తావించారు. రష్యా దిగుమతులు అధికంగా ఉన్నందుకే ఈ సుంకాలు పెట్టామని, ఇప్పుడు పరిస్థితులు మారిన నేపథ్యంలో వాటిని తగ్గించే దిశగా ఆలోచిస్తున్నట్టు అమెరికా సంకేతాలు ఇచ్చింది. అమెరికా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని భారత్ ఇప్పటికే తగిన చర్యలు తీసుకుందని, కాబట్టి టారిఫ్‌లను వెంటనే రద్దు చేయాలని జీటీఆర్‌ఐ సూచించింది.
వివరాలు
పెరిగిన క్రూడ్ ఆయిల్ దిగుమతులు
ఈ సుంకాల తగ్గింపును ఏ విధమైన వాణిజ్య ఒప్పందాలకూ అనుసంధానించవద్దని స్పష్టం చేసింది. టారిఫ్‌లు తొందరగా తగ్గించకపోతే, అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు ఆశించినంత ముందుకు సాగకపోవచ్చని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించాలని అమెరికా పెట్టిన ఆంక్షలు అందరికీ తెలిసిందే. ఇక మరోవైపు, అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, అమెరికా నుంచి భారత్ కి క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెరిగాయి. 2022 తర్వాత ఈ అక్టోబరులో ఆ దిగుమతులు అత్యధిక స్థాయికి చేరాయి. అలాగే, అమెరికా ఆంక్షల తర్వాత రిలయన్స్, హెచ్‌పీసీఎల్-మిత్తల్ ఎనర్జీ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ సంస్థలు రష్యా చమురు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి.