LOADING...
India-New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏతో 57% ఉత్పత్తులకు సున్నా సుంకాలు
భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏతో 57% ఉత్పత్తులకు సున్నా సుంకాలు

India-New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏతో 57% ఉత్పత్తులకు సున్నా సుంకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)అమల్లోకి వచ్చిన వెంటనే తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో 57 శాతం వస్తువులపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు కానున్నాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన గురువారం ఎక్స్ వేదికగా ప్రకటించారు.ఎఫ్‌టీఏ అమలులోకి వచ్చిన తొలి రోజే ఈ సున్నా శాతం సుంకాల విధానం అమల్లోకి వస్తుందని లక్సన్ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల న్యూజిలాండ్ వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభించడంతో పాటు ఎగుమతులు మరింత పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత మార్కెట్‌లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు మరింత విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

ఏప్రిల్ 27న భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ ఖరారు

ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కూడా చెప్పారు. ఇదిలా ఉండగా,భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. గత నాలుగు దశాబ్దాల్లో భారత ప్రధాని న్యూజిలాండ్‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే వ్యాపారవేత్తలు, క్రీడాకారులతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఇరు దేశాలు ఖరారు చేసుకున్నాయి.

Advertisement