Loading...
PM Modi: భారత్‌తో పాటు ఇతర దేశాలూ ఎదగాలన్నదే మా ఆకాంక్ష.. బ్లూమ్‌బర్గ్ సదస్సులో మోదీ
భారత్‌తో పాటు ఇతర దేశాలూ ఎదగాలన్నదే మా ఆకాంక్ష.. బ్లూమ్‌బర్గ్ సదస్సులో మోదీ

PM Modi: భారత్‌తో పాటు ఇతర దేశాలూ ఎదగాలన్నదే మా ఆకాంక్ష.. బ్లూమ్‌బర్గ్ సదస్సులో మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ సాధిస్తున్న విజయాలు ప్రపంచంలోని ఇతర దేశాలకూ ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ తన అభివృద్ధితో పాటు ఇతర దేశాలూ ముందుకు సాగాలని కోరుకుంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధి అంచనాను శాతానికి పెంచిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ సదస్సులో పాల్గొన్న మోదీ.. దేశ ఆర్థిక వృద్ధి, సాంకేతికత,పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. సాంకేతికత,జ్ఞానం, ఆవిష్కరణలు అభివృద్ధికి కీలకమైన శక్తులని మోదీ పేర్కొన్నారు. వాటిని ఎవరు కలిగి ఉన్నారనే దానికంటే, వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నారనేదే ముఖ్యమని వివరించారు. ఈ వనరులను ఉపయోగించి కోట్లాది మంది ప్రజలకు కొత్త అవకాశాలు కల్పించాలని సూచించారు.

వివరాలు 

పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అనుకూలమైన గమ్యస్థానం 

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని అన్నారు.

భారత సంప్రదాయాలు కూడా ఇదే విషయాన్ని బోధిస్తున్నాయని, ప్రభుత్వాలు సైతం పాలనలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని వెల్లడించారు.

చైనా కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటును నమోదు చేస్తుండటంపైనా ప్రధాని స్పందించారు.

పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అనుకూలమైన గమ్యస్థానమని పేర్కొన్నారు.

దేశంలో డిజిటల్ నైపుణ్యాలు గణనీయమైన మార్పులకు కారణమవుతాయని, అవి భారత్‌కు గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తాయని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా కొత్త అవకాశాలను సృష్టించే సామర్థ్యం భారత్‌కు ఉందని మరోసారి స్పష్టం చేశారు.

వివరాలు 

వ్యూహాత్మక రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం: చంద్రశేఖరన్

సెమీకండక్టర్ల వంటి కీలకమైన వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులను దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి రంగాల్లో పెట్టుబడుల ఫలితాలను కేవలం రెండు, మూడేళ్ల వ్యవధిలోనే అంచనా వేయకూడదని పేర్కొన్నారు.

ఆ సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామా లేదా అన్నదాని కంటే, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు కొనసాగించడం ముఖ్యమని వివరించారు.

భవిష్యత్తులో మెమొరీ చిప్‌ల అవసరం ప్రాథమికంగా మారబోతోందని చంద్రశేఖరన్ తెలిపారు.

అందువల్ల చిప్‌ల తయారీ వంటి కీలక రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ADVERTISEMENT