Page Loader
2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు 
2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు

2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు 

వ్రాసిన వారు Stalin
Jun 27, 2023
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాణిజ్య లోటుతో పాటు బలమైన సేవల ఎగుమతుల కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) 1.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఆర్ బి ఐ నివేదిక వెల్లడించింది. Q4 కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 0.2శాతానికి పడిపోయింది. అలాగే Q4లో ఎఫ్‌డీఐ 6.4 బిలియన్ డాలర్ల పెరుగుదలను నమోదు చేసింది. అయితే ఫోరెక్స్ మార్పిడి నిల్వలు బాగా పడిపోయాయి. Q3లో సీఏడీ 16.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది జీడీపీలో 2శాతం. గత ఆర్థిక సంవత్సరం Q4లో సీఏడీ 13.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది జీడీపీలో 1.6శాతం.

ఆర్థిక సంవత్సరం

గతేడాది కంటే గణనీయంగా తగ్గిన ఎఫ్ఐడీలు

కంప్యూటర్ సేవల వల్ల నికర ఆదాయాలు పెరగడం వల్ల సీక్వెన్షియల్, ఇయర్-ఆన్-ఇయర్ ప్రాతిపదికన దేశ నికర సేవల్లో పెరుగుదల నమోదైనట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రధానంగా విదేశాలలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల చెల్లింపులు 28.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది ఏడాది క్రితం కంటే 20.8శాతం పెరిగింది. భారతదేశం నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) 2023 Q4లో 6.4 బిలియన్ డాలర్లుగా ఉంది. Q3లో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. 2022 Q4లో ఎఫ్‌డీఐ 13.8బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎఫ్‌డీఐ తక్కువగా నమోదైంది.