
India:పదేళ్లలో భారత జీడీపీ డబుల్.. జపాన్, జర్మనీని అధిగమించే దిశగా ముందుకు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం గత పదేళ్లలో గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించింది.
2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), 2025 నాటికి 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) నివేదిక వెల్లడించింది.
దీంతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్ర ఐదుగురిలో స్థానం సంపాదించింది.
ఐఎంఎఫ్ డేటా ప్రకారం
2015లో భారత జీడీపీ: 2.4 ట్రిలియన్ డాలర్లు
2025 నాటికి: 4.3 ట్రిలియన్ డాలర్లు
వృద్ధి రేటు: 77 శాతం
ఈ వేగంతో కొనసాగితే 2025 నాటికి జపాన్‌ను, 2027 నాటికి జర్మనీని భారత్ అధిగమించే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
Details
చైనా ప్రగతి
పక్క దేశమైన చైనా కూడా గత పదేళ్లలో 74 శాతం జీడీపీ వృద్ధిని సాధించింది.
2015లో చైనా జీడీపీ: 11.2 ట్రిలియన్ డాలర్లు
2025లో 19.5 ట్రిలియన్ డాలర్లు
అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాను చైనా అధిగమించలేకపోయింది. కోవిడ్ ప్రభావంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.
అగ్రస్థానంలో అమెరికా
ప్రపంచంలో అగ్ర ఆర్థిక శక్తిగా అమెరికా తన హోదాను కొనసాగిస్తోంది.
2015లో అమెరికా జీడీపీ: 23.7 ట్రిలియన్ డాలర్లు
2025 నాటికి: 30.3 ట్రిలియన్ డాలర్లు
వృద్ధి రేటు: 28 శాతం
లెక్కల్లో ఆసియా దేశాల కన్నా తక్కువ వృద్ధి రేటు ఉన్నా ఆర్థిక ఆధిపత్యం మాత్రం అమెరికాదే.
Details
యూరప్ దేశాల వృద్ధి
యూరప్ దేశాలైన UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి ప్రధాన ఆర్థిక శక్తులు గత పదేళ్లలో 6 శాతం నుంచి 14 శాతం వరకు జీడీపీ వృద్ధిని నమోదు చేశాయి.
అయితే వృద్ధి తక్కువగా ఉన్నా యూరోప్ దేశాలు ప్రపంచ వాణిజ్యంలో ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి.