Unemployment: 5.1 శాతానికి పెరిగిన దేశంలో నిరుద్యోగ రేటు
ఈ వార్తాకథనం ఏంటి
పనిచేసే అవకాశం ఉన్న 15 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో నిరుద్యోగం మరింత పెరిగింది. గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన కార్మిక సర్వే వివరాల ప్రకారం,ఈ ఏడాది మార్చి నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 5.1 శాతానికి చేరింది. ఇటీవలి నెలలతో పోలిస్తే ఇదే అత్యధిక స్థాయి అని సర్వే స్పష్టం చేసింది. గత నెలలో ఈ రేటు 4.9 శాతంగా నమోదైనప్పటికీ, తాజా నెలలో మరింత పెరుగుదల కనిపించింది.
వివరాలు
గత నెలలో 55.4 శాతానికి తగ్గిన కార్మిక శక్తి భాగస్వామ్య రేటు
పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 0.2 శాతం పెరిగి 6.8 శాతానికి చేరింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా పెరిగి 4.3 శాతంగా నమోదైంది. లింగాల వారీగా చూస్తే, పురుషుల్లో నిరుద్యోగం 5 శాతానికి చేరింది. మహిళల్లో కూడా కొంత పెరుగుదల చోటుచేసుకుని 5.3 శాతంగా నమోదైంది. మరోవైపు, పని కోసం ప్రయత్నిస్తున్న వారి శాతాన్ని సూచించే కార్మిక శక్తి భాగస్వామ్య రేటు గత నెలలో 55.4 శాతానికి తగ్గింది.