Loading...
UPI: నెలకు 2,000 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ జోరు..
నెలకు 2,000కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు..డిజిటల్ చెల్లింపుల్లో భారత్ జోరు..

UPI: నెలకు 2,000 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ జోరు..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకెళ్తోంది. దేశంలో అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రపంచ రియల్‌టైమ్ పేమెంట్స్ రంగంలో కీలక బెంచ్‌మార్క్‌గా మారింది. ప్రస్తుతం నెలకు 20 బిలియన్లకు పైగా లావాదేవీలను యూపీఐ నిర్వహిస్తోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించి కోట్లాది మందిని డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తీసుకురావడంతో పాటు భారీ స్థాయిలో లావాదేవీలను నిర్వహించడం సాధ్యమేనని భారత్ నిరూపించింది. ప్రముఖ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) తన తాజా నివేదికలో యూపీఐ విజయాన్ని ప్రశంసించింది. ప్రపంచ చెల్లింపుల ఆదాయం 2030 నాటికి 2.6 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని BCG అంచనా వేసింది.

వివరాలు 

పంచ చెల్లింపుల రంగం సగటున 7 శాతం వార్షిక వృద్ధి

గత ఐదేళ్లలో ప్రపంచ చెల్లింపుల రంగం సగటున 7 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా.. రానున్న కాలంలో ఈ వృద్ధిరేటు 5 శాతానికి పరిమితం కావచ్చని నివేదిక పేర్కొంది.

అయితే అన్ని ప్రాంతాల్లోనూ ఒకే స్థాయిలో వృద్ధి ఉండదని BCG తెలిపింది.

ఉత్తర అమెరికా, యూరప్ ప్రాంతాల్లో చెల్లింపుల రంగం సుమారు 5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉండగా.. పశ్చిమాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో 8 శాతం వేగంతో విస్తరించవచ్చని అంచనా వేసింది.

వివరాలు 

కోట్లాది మందికి డిజిటల్ చెల్లింపులు

BCG మేనేజింగ్ డైరెక్టర్, భాగస్వామి వివేక్ మాంధాత భారత్‌లో యూపీఐ సాధించిన పురోగతిని డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కీలక మైలురాయిగా అభివర్ణించారు.

కోట్లాది మంది సామాన్యులను డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలోకి తీసుకురావడమే కాకుండా.. భారీ సంఖ్యలో లావాదేవీలను నిర్వహించే సామర్థ్యాన్ని భారత్ సాధించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ విధానం ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఒక నమూనాగా నిలుస్తోందని వివరించారు.

క్రెడిట్ కార్డుల వినియోగం కూడా పెరుగుతోంది

యూపీఐ వినియోగం పెరుగుతున్న సమయంలోనే క్రెడిట్ కార్డుల వాడకం కూడా, ముఖ్యంగా ఆన్‌లైన్ చెల్లింపుల్లో, గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది.

ఈ రెండు చెల్లింపు విధానాల విస్తరణ బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తోందని వివేక్ మాంధాత వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

చెల్లింపుల్లో ఏఐ కీలకం

భవిష్యత్‌లో పేమెంట్స్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషించనుందని BCG నివేదిక స్పష్టం చేసింది.

చెల్లింపుల నిర్వహణలో వ్యయాలను తగ్గించడం, కొత్త ఉత్పత్తులను మరింత మెరుగ్గా రూపొందించడం, పేపర్ ఆధారిత ప్రక్రియలను ఆటోమేట్ చేయడం వంటి అంశాల్లో ఏఐ ఉపయోగపడుతుందని పేర్కొంది.

వ్యాపారులకు పేమెంట్ పార్ట్‌నర్ మార్పుపై ఆసక్తి

ఏజెంట్ల ద్వారా జరిగే లావాదేవీలకు మెరుగైన మద్దతు అందించే సంస్థలకు వ్యాపారులు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

ఏజెంట్-ఇనిషియేటెడ్ ట్రాన్సాక్షన్స్‌కు మెరుగైన సేవలు అందిస్తే.. తమ ప్రస్తుత పేమెంట్ భాగస్వామిని మార్చుకోవడానికి 73 శాతం మంది పెద్ద వ్యాపారులు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

ADVERTISEMENT

వివరాలు 

137 దేశాల్లో తక్షణ చెల్లింపుల వ్యవస్థలు

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 137 దేశాలు తమ సొంత తక్షణ చెల్లింపుల వ్యవస్థలను కలిగి ఉన్నాయని BCG తెలిపింది.

రియల్‌టైమ్ పేమెంట్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని పేర్కొంది.

వేగవంతమైన డిజిటల్ లావాదేవీలు, పెరుగుతున్న ఆన్‌లైన్ చెల్లింపులు, ఏఐ ఆధారిత సేవలు, కొత్త పేమెంట్ మౌలిక సదుపాయాలు కలిసి ప్రపంచ చెల్లింపుల రంగంలో కీలక మార్పులకు దారితీస్తున్నాయని నివేదిక వివరించింది.

ADVERTISEMENT