Loading...
Stock Market: అమెరికా-ఇరాన్‌ చర్చల ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ సూచీలు
అమెరికా-ఇరాన్‌ చర్చల ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ సూచీలు

Stock Market: అమెరికా-ఇరాన్‌ చర్చల ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఐక్యరాజ్యసమితి (ఐరాస) 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశం నేపథ్యంలో అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా మెటల్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. సెన్సెక్స్‌ ఉదయం 74,648.32 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. మునుపటి సెషన్‌లో ఇది 74,529.08 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి సూచీ ఎక్కువగా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో ఒక దశలో 74,973.74 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 299.17 పాయింట్లు లాభపడి 74,828.25 వద్ద స్థిరపడింది.

వివరాలు 

. 117.80 పాయింట్లు లాభపడిన నిఫ్టీ

ఇదే సమయంలో నిఫ్టీ కూడా రాణించింది. 117.80 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 23,446.80 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.

మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.74గా నమోదైంది.

సెన్సెక్స్‌-30లోని షేర్లను పరిశీలిస్తే.. టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ముగిశాయి.

మరోవైపు హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

వివరాలు 

క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 99.06 డాలర్లు 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 99.06 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

క్రూడ్‌ ధర 100 డాలర్ల దిగువకు రావడం మార్కెట్‌ వర్గాల్లో కొంత సానుకూలతను పెంచింది.

మరోవైపు బంగారం ధర కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 4,316.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT