NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్
    తదుపరి వార్తా కథనం
    స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్
    స్టార్‌బక్స్ సిఈఓగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్

    స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 21, 2023
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గత ఏడాది సెప్టెంబర్‌లో, నరసింహన్ కంపెనీ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టార్‌బక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు అవుతారని స్టార్‌బక్స్ ప్రకటించింది.

    భారతీయ సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ లక్ష్మణ్ నరసింహన్ సోమవారం అధికారికంగా స్టార్‌బక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించారు. దీనితో లక్ష్మణ్ కూడా గ్లోబల్ కార్పొరేషన్ల అధికారంలో భారతీయ నాయకులు ఉన్న లిస్ట్ లో చేరారు.

    కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ సిఈఓ హోవార్డ్ షుల్ట్జ్ తర్వాత స్టార్‌బక్స్ కొత్త నాయకుడి కోసం చాలా అన్వేషిస్తుండగా, నరసింహన్ లండన్ నుండి సీటెల్ ప్రాంతానికి మకాం మార్చిన తర్వాత అక్టోబర్ 1, 2022న ఇన్‌కమింగ్ సిఈఓగా స్టార్‌బక్స్‌లో చేరారు. మార్చి 23న స్టార్‌బక్స్ వార్షిక వాటాదారుల సమావేశానికి నరసింహన్ నాయకత్వం వహిస్తారు.

    సంస్థ

    నరసింహన్ స్టార్‌బక్స్‌కు దాదాపు 30 సంవత్సరాల అనుభవాన్ని అందించారు

    నరసింహన్, స్టార్‌బక్స్‌కు దాదాపు 30 సంవత్సరాల అనుభవాన్ని అందించారు. ప్రపంచ వినియోగ వస్తువుల వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు. రిటైల్, కిరాణా, రెస్టారెంట్, ఇ-కామర్స్ కంపెనీలకు సలహాదారుగా ఉన్నారు.

    గత ఐదు నెలలుగా, అతను 30కి పైగా దుకాణాలు, తయారీ ప్లాంట్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహాయక కేంద్రాలలో ఉద్యోగులతో కలిసి పని చేయడాన్ని ప్రారంభించారని కంపెనీ తెలిపింది.

    నరసింహన్ భారతదేశంలోని పూణే విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందారు. అతను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని లాడర్ ఇన్స్టిట్యూట్ నుండి జర్మన్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ది వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి ఫైనాన్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టాలు సంపాదించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    సంస్థ
    ప్రకటన
    ఆదాయం

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    వ్యాపారం

    వారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్ ఆదాయం
    2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఆదాయం
    BYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత సంస్థ
    జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం ప్రకటన

    సంస్థ

    Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్ గూగుల్
    మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు గూగుల్
    ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం వ్యాపారం

    ప్రకటన

    తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు వ్యాపారం
    త్వరలో లాంచ్ కానున్న కియా EV9 స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV ఆటో మొబైల్
    ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది వ్యాపారం
    ప్రపంచవ్యాప్తంగా GPT-4 ఉపయోగిస్తున్న సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఆదాయం

    GDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్ ఆర్ధిక వ్యవస్థ
    FTX వివాదంలో చిక్కుకున్న భారతీయ సంతతికి చెందిన టెక్కీ నిషాద్ సింగ్ వ్యాపారం
    కరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం వ్యాపారం
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025