IndiGo: సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు అక్టోబర్ 31 వరకు ఇండిగో విమానాలు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీకి వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసుల రద్దు గడువును మరికొంత కాలం పొడిగించింది. సౌదీలోని విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.
వివరాలు
రియాద్‌కు అక్టోబర్ 31 వరకు విమానాలు రద్దు
సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ఈ వివరాలను ఎక్స్ (X) వేదికగా ప్రకటించింది.
వివిధ నగరాలకు విమాన సర్వీసుల రద్దు గడువులను వెల్లడించింది. రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను అక్టోబర్ 31, 2026 వరకు రద్దు చేశారు.
జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు విమాన సర్వీసులను అక్టోబర్ 27, 2026 వరకు నిలిపివేశారు. ఈ తేదీలు కూడా రద్దు గడువులో భాగమేనని స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండిగో చేసిన ట్వీట్
Travel Advisory
— IndiGo (@IndiGo6E) October 23, 2026
In view of the evolving security situation and following a careful assessment, IndiGo flights to and from Riyadh will remain cancelled until 31 October 2026 (inclusive), while flights to and from Jeddah, Dammam and Madinah will remain cancelled until 27 October…
వివరాలు
ఇతర భారతీయ విమానయాన సంస్థల సర్వీసులూ నిలిపివేత
ఇండిగోతో పాటు ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా సౌదీ అరేబియాకు విమాన సర్వీసులను నిలిపివేశాయి.
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అన్ని మార్గాల్లో తమ విమానాలను అక్టోబర్ 24, 2026 వరకు రద్దు చేశాయి.
ఆకాశ ఎయిర్ సైతం అన్ని మార్గాల్లో విమాన సర్వీసులను అక్టోబర్ 27, 2026 వరకు నిలిపివేసింది.
ప్రాంతీయ భద్రతా పరిస్థితులను బట్టి విమానాల రద్దు గడువుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
అందువల్ల ప్రయాణికులు విమానాశ్రయాలకు బయలుదేరే ముందు తమ విమానాల తాజా స్థితిని సంబంధిత విమానయాన సంస్థల ద్వారా నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు.
వివరాలు
సౌదీలో దాడులు.. భారతీయుడు మృతి
ఇదిలా ఉండగా, ఇటీవల సౌదీ అరేబియాపై హౌతీల దాడులు తీవ్రతరమైనట్లు సమాచారం.
బుధవారం దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
అదే రోజు సౌదీ అరామ్‌కోకు చెందిన షైబా చమురు క్షేత్రంపై జరిగిన మరో దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు.
ఈ ఘటనల నేపథ్యంలో సౌదీ అరేబియాలో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు సర్వీసుల రద్దును కొనసాగిస్తున్నాయి.