LOADING...
Mutual funds : గిఫ్ట్ కార్డ్స్‌తో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి.. సెబీ కొత్త ప్రతిపాదన!
గిఫ్ట్ కార్డ్స్‌తో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి.. సెబీ కొత్త ప్రతిపాదన!

Mutual funds : గిఫ్ట్ కార్డ్స్‌తో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి.. సెబీ కొత్త ప్రతిపాదన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల విడుదల చేసిన కన్సల్టేషన్ పేపర్‌లో సెబీ 'గిఫ్ట్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్' (Gift PPI) అనే కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇవి ప్రీపెయిడ్ కార్డులు లేదా డిజిటల్ వోచర్ల రూపంలో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసి ఇతరులకు బహుమతిగా ఇవ్వొచ్చు. అయితే ఈ కార్డుల ద్వారా వచ్చిన డబ్బును కేవలం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిగా మాత్రమే ఉపయోగించాలి. ఇవి సాధారణంగా అమెజాన్ లేదా ప్లిఫ్ కార్ట్ గిఫ్ట్ కార్డుల్లానే కనిపించినా, వాటిలా షాపింగ్‌కు ఉపయోగించలేరు. గిఫ్ట్ అందుకున్న వ్యక్తి ఆ మొత్తాన్ని తప్పనిసరిగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి.

వివరాలు

ఎలా పనిచేస్తాయి?

మొదటిసారి పెట్టుబడిదారులను దృష్టిలో పెట్టుకుని సెబీ రెండు మార్గాలను సూచించింది. 1. గిఫ్ట్ ఇచ్చే వ్యక్తి ఎంపిక చేసే విధానం కార్డు కొనుగోలు చేసే వ్యక్తి ముందుగానే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను సూచించవచ్చు. అయితే ఆ సూచనను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఇది పెట్టుబడి సలహాగా పరిగణించబడదు. గ్రహీత తనకు నచ్చిన స్కీమ్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ విధానం 'డైరెక్ట్ ప్లాన్' కింద జరుగుతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఉండదు, ఖర్చులు తక్కువగా ఉంటాయి.

వివరాలు

2. గ్రహీత ఎంపిక చేసే విధానం

గిఫ్ట్ అందుకున్న వ్యక్తి తనకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సలహాతో స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. ఈ సందర్భంలో పెట్టుబడి 'రెగ్యులర్ ప్లాన్' ద్వారా జరుగుతుంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఉంటుంది. ఏ మార్గం ఎంచుకోవాలో పూర్తిగా గ్రహీతపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత యూనిట్లను విక్రయిస్తే, ఆ డబ్బు కేవలం గ్రహీత బ్యాంక్ ఖాతాలోకే జమ అవుతుంది.

Advertisement

వివరాలు

నిబంధనలు, పరిమితులు

ఈ విధానం దుర్వినియోగం కాకుండా సెబీ కొన్ని స్పష్టమైన నియమాలు ప్రతిపాదించింది. ఒక్కో గిఫ్ట్ కార్డు గరిష్ట విలువ రూ.10,000 ఒకసారి జారీ చేసిన తర్వాత రీలోడ్ చేయడం వీలుకాదు మొత్తం మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడిగా పెట్టాలి ఏడాది లోపు వాడకపోతే, డబ్బు తిరిగి గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి వెళ్తుంది ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000కు మించిన గిఫ్ట్ కార్డ్ పెట్టుబడిని ఆర్టీఏలు అనుమతించవు కేవలం బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా యూపీఐ ద్వారానే కార్డులను కొనాలి

Advertisement

వివరాలు

భద్రతా ప్రమాణాలు

థర్డ్ పార్టీ పేమెంట్స్‌ను నివారించేందుకు 'ఓనర్‌షిప్ వాలిడేషన్' విధానం అమలు చేస్తారు. గిఫ్ట్ కార్డు పై ఉన్న పేరు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో ఉన్న పేరుతో సరిపోలాలి. సరిపోకపోతే లావాదేవీ తిరస్కరించబడుతుంది. దీని వల్ల ఇతరుల పేరుతో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండదు. కార్డు జారీ ఖర్చులను మ్యూచువల్ ఫండ్ కంపెనీలే భరిస్తాయి.

వివరాలు

ఇన్వెస్టర్లకు అర్థం ఏమిటి?

గిఫ్ట్ ట్యాక్స్ నిబంధనలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. బంధువులు కాని వ్యక్తుల నుంచి వచ్చే గిఫ్టులు సంవత్సరానికి రూ.50,000 లోపు ఉంటే పన్ను ఉండదు. దాటితే పన్ను చెల్లించాలి. అయితే కుటుంబ సభ్యుల నుంచి వచ్చే గిఫ్టులకు మినహాయింపు ఉంటుంది. కార్డు పరిమితి రూ.10,000 కావడంతో ఒకే వ్యక్తి నుంచి వచ్చే గిఫ్ట్ సాధారణంగా పన్ను పరిధిలోకి రాదు. అయితే మొత్తం గిఫ్టుల విలువను గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పెట్టుబడి విక్రయం సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది.

వివరాలు

కొత్త అవకాశాల దిశగా…

భారత మ్యూచువల్ ఫండ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించడం ఇంకా సవాలుగానే ఉంది. ఈగిఫ్ట్ కార్డులు ఆ ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.కేవైసీ, ఫోలియో సృష్టి వంటి ప్రక్రియలు కూడా సులభమవుతాయి. ప్లాన్ రూపీ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి ప్రకారం, బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చినట్లే, మ్యూచువల్ ఫండ్ గిఫ్ట్ కార్డులు కూడా ప్రజల్లో ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. కొత్త ఇన్వెస్టర్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ఇది సమర్థవంతమైన మార్గంగా మారవచ్చు. మొత్తంగా ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే పెట్టుబడి అనే క్లిష్టమైన అంశం కూడా ఒక సాధారణ 'గిఫ్ట్'లా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఈవిధానం ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.

Advertisement