10-Minute Delivery: 10 నిమిషాల్లో డెలివరీపై జొమాటో సీఈఓ పోస్ట్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబరు 31న గిగ్ వర్కర్లు తమ పని పరిస్థితులు, సామాజిక భద్రత అంశాలను ముందుంచి చేపట్టిన సమ్మె 'క్విక్ డెలివరీ' వ్యవహారాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చింది. కొత్త సంవత్సరం ఆర్డర్లపై ఈ సమ్మె తీవ్ర ప్రభావం చూపకపోయినప్పటికీ, 10-నిమిషాల డెలివరీ (10-Minute Delivery) మోడల్ కారణంగా రైడర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడి సామాజిక మాధ్యమాల్లో చర్చకు ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. '10 నిమిషాల్లో డెలివరీ' విధానంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇది సురక్షితమేనని, డెలివరీ పార్టనర్ భద్రతతో తాము రాజీపడట్లేదని వెల్లడించారు.
వివరాలు
మన వ్యవస్థను అర్థం చేసుకోకపోవడం వల్ల కొందరు దీన్ని రిస్క్‌గా భావిస్తున్నారు: దీపిందర్
"ఇళ్ల చుట్టుపక్కల చిన్న వ్యాపారాలు పెరుగడంతోనే 10 నిమిషాల డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. కానీ, డెలివరీ PARTNER వేగంగా డ్రైవ్ చేయాల్సిందని చేయాలనీ మా ఉద్దేశం కాదు. కస్టమర్‌కు మేము ఇచ్చిన డెలివరీ సమయాన్ని యాప్‌లో రైడర్‌కు చూపించవద్దని మేము ప్లాన్ చేసాం.బ్లింకిట్‌లో ఆర్డర్ ఇచ్చిన 2.5నిమిషాల్లో వస్తువులను ప్యాక్ చేస్తాం. ఆ తర్వాత రైడర్ గంటకు సగటున 15 కిలోమీటర్ల వేగంతో,ప్రతి 8 నిమిషాలకు 2కిలోమీటర్ల దూరం మించకుండా డెలివరీ చేస్తారు. మన వ్యవస్థను అర్థం చేసుకోకపోవడం వల్ల కొందరు దీన్ని రిస్క్‌గా భావిస్తున్నారు. బహుశా ఈ వ్యవస్థలో లేకపోతే.. నేను కూడా గిగ్‌వర్కర్లను దోచుకుంటున్నారనే భావించేవాడిని.. కానీ అది నిజం కాదు.చాలా మంది స్వచ్ఛందంగా మాతో పనిచేయడానికి ముందుకొస్తున్నారు.
వివరాలు
4.5 లక్షల మంది పార్టనర్ లు 75 లక్షల పైగా ఆర్డర్లు
రెగ్యులర్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. సోషల్ మీడియాలో వున్న ప్రచారాలపై ఆధారపడకూడదు.మా సంస్థ డెలివరీ PARTNERలకు భద్రతను అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ వైద్య, జీవిత బీమా కవరేజ్ అందిస్తున్నాం. డిసెంబరు 31న జరిగిన సమ్మె నేపథ్యంలో, జొమాటో, బ్లింకిట్ రికార్డు స్థాయిలో డెలివరీలు పూర్తి చేశాయి. దాదాపు 4.5 లక్షల మంది పార్టనర్ లు 75 లక్షల పైగా ఆర్డర్లను పూర్తి చేశారు. అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వకుండానే ఇది సాధ్యమైంది. అందరికీ కృతజ్ఞతలు" అని దీపిందర్ గోయల్ రాసుకొచ్చారు.
వివరాలు
సమ్మె లో 1.7 లక్షల మంది వర్కర్లు
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చెల్లింపులు పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిసెంబరు 31న సమ్మె నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 1.7 లక్షల మంది వర్కర్లు ఇందులో పాల్గొన్నారు. అయితే న్యూ ఇయర్ వేళ ఈ సమ్మె ప్రభావాన్ని తగ్గించడానికి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ప్రోత్సాహకాలు ప్రకటించాయన్న వార్తలను జొమాటో సీఈఓ తన పోస్టులో ఖండించారు.