Loading...
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో సరికొత్త రికార్డు.. కోటి దరఖాస్తులు
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో సరికొత్త రికార్డు.. కోటి దరఖాస్తులు

Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో సరికొత్త రికార్డు.. కోటి దరఖాస్తులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ పబ్లిక్ ఇష్యూకు కోటి దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులు అందుకున్న తొలి కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచింది. గతంలో వారీ ఎనర్జీస్ ఐపీఓ పేరిట ఉన్న 97 లక్షల దరఖాస్తుల రికార్డును అధిగమించింది. జియో ఐపీఓకు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం సాయంత్రం వరకు గడువు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, భారత్ కోకింగ్ కోల్ ఐపీఓలకు దాదాపు 90 లక్షల చొప్పున దరఖాస్తులు వచ్చాయి.

వివరాలు 

రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 17.19 కోట్ల షేర్లకు బిడ్లు

జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా మొత్తం 19.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచారు.

శుక్రవారం మధ్యాహ్నం 12.03 గంటల సమయానికి 135.32 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి.

క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల (QIB) విభాగంలో 4.90 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా.. 70.85 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి.

దీంతో ఈ విభాగం 14.46 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగానికి 9.45 రెట్ల స్పందన లభించింది.

రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 17.19 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ఈ విభాగం 2.02 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

వివరాలు 

నేటితో ముగియనున్న ఐపీఓ

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు దరఖాస్తు చేసుకునే గడువు శుక్రవారం (అక్టోబర్ 23)తో ముగియనుంది.

అదే రోజు రాత్రి 7 గంటల వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఐపీఓలో షేర్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 26న జరగనుంది.

అనంతరం అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు లిస్ట్ కానున్నాయి.

మొత్తం రూ.30,213 కోట్ల విలువైన ఈ ఐపీఓలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ఇప్పటికే రూ.8,110 కోట్లను సమీకరించింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జియో ఐపీఓకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

ADVERTISEMENT