Page Loader
layoffs: టెక్‌ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. ఇప్పటివరకు 62,000 మంది ఇంటికి!
టెక్‌ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. ఇప్పటివరకు 62,000 మంది ఇంటికి!

layoffs: టెక్‌ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. ఇప్పటివరకు 62,000 మంది ఇంటికి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్‌ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పరంపర ఈ ఏడాదీ కొనసాగుతోంది. ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు భారీగా ఉద్యోగులను తొలగించడం జరుగుతోంది. దీనివల్ల టెక్‌ రంగంలో అనిశ్చితి పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 62,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించడం జరిగింది. ఇప్పటికే ప్రకటించిన లేఆఫ్‌ల వివరాల ప్రకారం, ఈ ఏడాదిలో మొత్తం ఉద్యోగాల తొలగింపుల సంఖ్య లక్ష మార్కును అధిగమించనుంది.

Details

కొత్త అవకాశాల ఎదురుచూస్తున్న యువత

ముఖ్య టెక్‌ కంపెనీలు వ్యాపార విధానం, నిర్వహణ శైలిలో అనూహ్య మార్పులను చేపడుతుండటంతో సెమికండక్టర్‌ పరిశ్రమ నుంచి సోషల్‌ మీడియా రంగం వరకు ఉద్యోగాల కోతలు విస్తృతంగా చోటుచేసుకుంటున్నాయి. దీని ఫలితంగా, ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది పోటీ ప్రపంచంలో కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నారు. హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఇంటెల్‌, ఫిన్‌టెక్‌ కంపెనీ బ్లాక్‌, అంతరిక్ష పరిశోధన సంస్థ బ్లూ ఆరిజన్‌ వంటి కంపెనీలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ ఏడాది వివిధ టెక్‌ సంస్థలు తొలగిస్తున్న ఉద్యోగుల సంఖ్య ఇలా ఉంది.