LOADING...
RBI Jobs: డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతాలు
డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతాలు

RBI Jobs: డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ బ్రాంచుల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ ఇంజినీర్ (సివిల్) 7 పోస్టులు, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 4 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 6, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసే వారు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీలో కనీసం 65శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి ఏప్రిల్ 1, 2026నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

వివరాలు

2026 జూన్ లో రాతపరీక్ష

అదనంగా, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠంగా 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష జూన్ 2026లో నిర్వహించనున్నారు. రాత పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలకు 300 మార్కులు కేటాయించబడతాయి. ఇందులో ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ విభాగం 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంజినీరింగ్ పేపర్-1 (డిస్క్రిప్టివ్) 40 ప్రశ్నలకు 100 మార్కులు, ఇంజినీరింగ్ పేపర్-2 (డిస్క్రిప్టివ్) 40 ప్రశ్నలకు 100 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.

Advertisement