Ketan Parekh: మళ్లీ కేతన్ పరేఖ్ ప్రకంపనలు.. రూ.65.77 కోట్ల లాభాలను కొల్లగొట్టారు
ఈ వార్తాకథనం ఏంటి
కేతన్ పరేఖ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2021 జనవరి 1 నుంచి 2023 జూన్ 20 మధ్య జరిగిన లావాదేవీలపై సెబీ (SEBI) నిర్వహించిన దర్యాప్తులో, అతని పాత్ర అసాధారణమైన ఫ్రంట్ రన్నింగ్ కుంభకోణంలో ఉన్నట్లు తేల్చింది.
ఈ కుంభకోణంలో కేతన్ పరేఖ్ రూ.65.77 కోట్ల చట్టవ్యతిరేక లాభాలను పొందారని, వాటిని వెనక్కి చెల్లించాలని సెబీ ఆదేశించింది.
ఈ వ్యవహారంలో 22 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు.
వివరాలు
ఫ్రంట్ రన్నింగ్ కుంభకోణంలో కీలకపాత్ర
సెబీ గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేయగా, కమలేశ్ వార్ష్‌నీ జారీ చేసిన ఆదేశాల్లో, రోహిత్ సల్గావ్‌కర్ (నోటిసీ నం.1), కేతన్ పరేఖ్ (నోటిసీ నం.2)లు ఈ మొత్తం కుంభకోణాన్ని నడిపారని పేర్కొన్నారు.
వీరు ఒక పెద్ద క్లయింట్‌కు చెందిన ఎన్‌పీఐ ట్రేడింగ్ సమాచారాన్ని ఉపయోగించి అక్రమ లాభాలను సాధించారని వెల్లడించారు.
అప్పుడు ఈ కార్యకలాపాలకు మధ్యవర్తిగా అకోశ్ కుమార్ పొద్దార్ (నోటిసీ నం.10) పనిచేశారు.
సెబీ ఇప్పటికే నోటిసీ నం.2, 10లపై మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం విధించగా, ఇప్పుడు నోటిసీ నం.1, 2, 10పై మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించింది.
వివరాలు
కుంభకోణం ఎలా జరిగింది?
ఫ్రంట్ రన్నింగ్ అనేది ట్రేడ్ సమాచారం ముందుగానే తెలుసుకుని దాన్ని మదుపర్లకు తెలియకుండా వాడటం.
ఈ వ్యవహారంలో రోహిత్ సల్గావ్‌కర్ ఒక పెద్ద క్లయింట్‌కు చెందిన ట్రేడర్లతో సమీప సంబంధాలను కలిగి ఉండేవారు.
వారు చేసే ట్రేడింగ్ సమాచారాన్ని రోహిత్ సేకరించి, కేతన్ పరేఖ్‌కు అందించేవారు.
ఈ సమాచారం ఆధారంగా కేతన్ పరేఖ్ వేర్వేరు ఖాతాల ద్వారా చట్టవ్యతిరేకంగా ట్రేడింగ్ నిర్వహించి లాభాలు పొందేవారు.
వివరాలు
సెబీ ఆదేశాల్లో వెల్లడి
కేతన్ పరేఖ్ గతంలో (2000లో) 14 సంవత్సరాల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధానికి గురయ్యారు.
ప్రస్తుతం కోల్‌కతాలోని సంస్థల ద్వారా ఈ ఫ్రంట్ రన్నింగ్ ట్రేడ్స్ నిర్వహించారు.
ఒక పెద్ద క్లయింట్‌కు సంబంధించిన 90% ట్రేడ్స్ కేతన్ ఒక్కరే నిర్వహించగా, వాట్సప్ ద్వారా తన బృందానికి సమాచారం అందించి, చట్టవ్యతిరేక లాభాలను పంచుకున్నారు.