LOADING...
Gold silver Price Today : బంగారం ధరల్లో కీలక మార్పులు.. ఇవాళ ఏపీ, తెలంగాణలో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఇవే
బంగారం ధరల్లో కీలక మార్పులు.. ఇవాళ ఏపీ, తెలంగాణలో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఇవే

Gold silver Price Today : బంగారం ధరల్లో కీలక మార్పులు.. ఇవాళ ఏపీ, తెలంగాణలో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఇవే

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇవాళ ఊరటనిచ్చే వార్త వచ్చింది. దేశీయ మార్కెట్లో గోల్డ్‌, సిల్వర్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల వరుస మార్పులకు గురైన బంగారం ధరలు ప్రస్తుతం కొంత స్థిరత్వాన్ని కనబరుస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 26 డాలర్లు తగ్గి ప్రస్తుతం 4,516డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పులు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం పలు ప్రాంతాల్లో జీఎస్టీతో పాటు అన్ని ఛార్జీలు కలిపి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,83,492వద్ద కొనసాగుతోంది.

వివరాలు

10 గ్రాముల బంగారం ధర రూ.1,68,195

అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,195గా నమోదైంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,83,665గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,68,368 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,83,492గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,68,195గా నమోదైంది. వెండి ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్‌, విజయవాడ‌, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,85,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.2,95,000కు చేరింది.

Advertisement