LOADING...
Gold Rates: గంటలోనే గోల్డ్ ఢమాల్.. బంగారం ధర రూ.1530 పతనం!
గంటలోనే గోల్డ్ ఢమాల్.. బంగారం ధర రూ.1530 పతనం!

Gold Rates: గంటలోనే గోల్డ్ ఢమాల్.. బంగారం ధర రూ.1530 పతనం!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గంట వ్యవధిలోనే రేట్లు భారీగా తారుమారయ్యాయి. ఉదయం సమయంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గోల్డ్‌తో పాటు సిల్వర్ ధరలు కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు, డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల పసిడి ధరలపై తీవ్ర ప్రభావం పడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర ఒక్కసారిగా రూ.1530 మేర పడిపోయింది. ప్రస్తుతం నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర రూ.1,54,910గా ఉంది.

వివరాలు 

గంటల్లోనే భారీగా తగ్గిన పసిడి 

ఉదయం ఈ ధర రూ.1,56,440గా ఉండగా, కొన్ని గంటల్లోనే భారీగా తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.1,42,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు అమలులో ఉన్నాయి. మరోవైపు చెన్నై మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220గా నమోదైంది. నిన్న ఈ ధర రూ.1,57,530గా ఉండగా, నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.1310 మేర తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ప్రస్తుతం రూ.1,55,060 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

కిలోపై రూ.8 వేల మేర తగ్గిన వెండి 

నిన్న ఈ ధర రూ.1,56,590గా ఉండగా, నిన్నటితో పోలిస్తే రూ.1530 మేర పతనం నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,150గా ఉంది. సోమవారం ఈ ధర రూ.1,43,550 వద్ద ఉండటం గమనార్హం. ఇక వెండి ధరల విషయానికి వస్తే, మంగళవారం ఒక్కరోజులోనే కిలోపై రూ.8 వేల మేర తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.2.68 లక్షల వద్ద స్థిరపడింది. అదే సమయంలో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతోంది.

Advertisement