Loading...
Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. ఒక్కరోజులో పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందో తెలుసా..?

Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. ఒక్కరోజులో పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందో తెలుసా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయికి చేరుకుని సామాన్యులకు అందని ద్రాక్షలా మారిన పసిడి ధరలు కొంతకాలం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో వరుస మార్పులు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇతర భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం,వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సురక్షిత పెట్టుబడిగా బంగారంపై డిమాండ్ పెరగడంతో ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.

వివరాలు 

దేశీయంగా బంగారం ధరలు

సోమవారం గణనీయంగా తగ్గిన బంగారం ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి.

ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.770 వరకు పెరుగుదల నమోదైంది.

జులై 16 గురువారం ఉదయం 6 గంటల వరకు అందుబాటులో ఉన్న బులియన్ మార్కెట్ సమాచారం ప్రకారం దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,43,580కు చేరుకుంది.

22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 పెరిగి రూ.1,31,610గా నమోదైంది.

వెండి ధర

కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,34,900గా ఉంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం,వెండి ధరలు

హైదరాబాద్: 24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,43,580 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,31,610 వెండి కిలో: రూ.2,40,100

విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,43,580 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,31,610 వెండి కిలో: రూ.2,40,100

ఢిల్లీ: 24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,43,730 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,31,760 వెండి కిలో: రూ.2,34,900

ముంబై: 24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,43,580 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,31,610 వెండి కిలో: రూ.2,34,900

చెన్నై: 24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,43,790 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,31,810 వెండి కిలో: రూ.2,40,100

ADVERTISEMENT

వివరాలు 

గమనిక 

బెంగళూరు: 24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,43,580 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,31,610 వెండి కిలో: రూ.2,34,900

అయితే బంగారం, వెండి ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు.

స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, రవాణా ఖర్చులు, రాష్ట్ర పన్నులు, జీఎస్‌టీ ప్రభావం, జ్యువెలర్ల మార్జిన్ వంటి అంశాల ఆధారంగా నగరానికో ధర ఉండే అవకాశం ఉంది.

అందువల్ల కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ దుకాణాల్లో తాజా ధరలను ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.

బంగారం, వెండి ధరలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా వివరాలు పొందవచ్చు.

ADVERTISEMENT