Loading...
LIC New Plans: LIC కొత్త పాలసీలు: బీమా ప్లాటినమ్, జీవన్ రక్షతో రూ.24 లక్షల వరకు కవరేజ్
LIC కొత్త పాలసీలు: బీమా ప్లాటినమ్, జీవన్ రక్షతో రూ.24 లక్షల వరకు కవరేజ్

LIC New Plans: LIC కొత్త పాలసీలు: బీమా ప్లాటినమ్, జీవన్ రక్షతో రూ.24 లక్షల వరకు కవరేజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తన పాలసీదారులకు ఆర్థిక భద్రతతో పాటు ఆకర్షణీయమైన రాబడులు అందించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రెండు కొత్త బీమా పథకాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. LIC Beema Platinum, LIC Jeevan Raksha పేర్లతో ఈ కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. వివిధ వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించింది. ఎల్ఐసీ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రెండు పాలసీలను అధికారికంగా లాంచ్ చేసింది. పెరుగుతున్న ఆదాయాలు, ప్రజల సగటు ఆయుర్దాయం పెరగడం, ఆర్థిక అంశాలపై అవగాహన ఎక్కువ కావడం వంటి పరిణామాలతో బీమా రక్షణ, పొదుపు, రిటైర్మెంట్ సంబంధిత పాలసీలకు డిమాండ్ పెరుగుతోందని ఎల్ఐసీ తెలిపింది.

వివరాలు 

బీమా ప్లాటినమ్.. పొదుపుతో పాటు బీమా రక్షణ

పోటీ పెరుగుతున్న బీమా మార్కెట్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను, ఉత్పత్తుల శ్రేణిని ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎల్ఐసీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. దొరైస్వామి పేర్కొన్నారు.

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం సంస్థ వృద్ధికి కీలకమని 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన వివరించారు.

ఎల్ఐసీ ప్రవేశపెట్టిన బీమా ప్లాటినమ్ పాలసీ పొదుపు, బీమా రక్షణ రెండింటినీ కలిపి అందించే పథకం.

ఇందులో ప్రీమియం చెల్లింపు వ్యవధి పరిమితంగా ఉంటుంది. పాలసీదారులు చెల్లించే ప్రతి రూ.1,000 వార్షిక ప్రీమియంపై రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది.

అలాగే ప్రతి సంవత్సరం పాలసీ విలువపై 10 శాతం ఆదాయం క్రమం తప్పకుండా అందే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు.

వివరాలు 

బీమా ప్లాటినమ్.. పొదుపుతో పాటు బీమా రక్షణ

ఇప్పటికే ఉన్న పాలసీదారులతో పాటు మరణించిన పాలసీదారుల నామినీలకు కూడా ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది.

ఈ పాలసీ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటివ్, వ్యక్తిగత పొదుపు, బీమా పథకం. ఇందులో రాబడి ముందుగానే నిర్దిష్టంగా ఉంటుంది.

పాలసీదారులు 10 నుంచి 20 సంవత్సరాల మధ్య పాలసీ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు.

పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది.

పాలసీ గడువు పూర్తయినప్పుడు పాలసీదారుడికి బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో పాటు అప్పటివరకు జమ అయిన గ్యారెంటీడ్ అడిషన్స్ కూడా లభిస్తాయి.

ADVERTISEMENT

వివరాలు 

జీవన్ రక్ష.. పూర్తిస్థాయి టర్మ్ ఇన్సూరెన్స్

LIC Jeevan Raksha పూర్తిగా టర్మ్ ఇన్సూరెన్స్ పథకం. పాలసీ కాలవ్యవధిలో పాలసీదారుడు అకాల మరణానికి గురైతే, ఆయన కుటుంబానికి బీమా మొత్తాన్ని అందించడం ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశం.

ఇందులో పాలసీ విలువ స్థిరంగా ఉంటుంది. జీవన్ రక్ష పాలసీలో కనీస బీమా మొత్తాన్ని రూ.5 లక్షలుగా నిర్ణయించారు.

గరిష్ఠంగా రూ.24 లక్షల వరకు కవరేజ్ తీసుకునే అవకాశం ఉంది.

ప్రీమియం చెల్లింపులో కూడా పాలసీదారులకు పలు ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

పాలసీదారులు ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించే ఆప్షన్, లేదా ఏటా ప్రీమియం చెల్లించే విధానం, అలాగే పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించే అవకాశం ఎంచుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు  

జీవన్ రక్ష.. పూర్తిస్థాయి టర్మ్ ఇన్సూరెన్స్

దీంతో తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రీమియం చెల్లింపు విధానాన్ని నిర్ణయించుకునే వెసులుబాటు ఉంటుంది.

అంతేకాకుండా మహిళా పాలసీదారులకు ప్రత్యేక ప్రీమియం వర్తించేలా జీవన్ రక్ష ప్లాన్‌ను రూపొందించారు.

దీంతో మహిళలకు ప్రత్యేకంగా ప్రయోజనం కల్పించే విధంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఎల్ఐసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ADVERTISEMENT