Java4Shell: జావా ప్రోగ్రామింగ్‌లో భారీ లోపం.. జీపీటీ-6 సాయంతో గుర్తించిన స్టార్టప్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ రంగంలో విస్తృతంగా వినియోగించే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో తీవ్రమైన భద్రతా లోపం బయటపడింది. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ సంస్థ కాలిఫ్ (Calif) ఈ లోపాన్ని గుర్తించింది. ఇందుకోసం ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీ-6 ఏఐ మోడల్‌ను ఉపయోగించడం విశేషం. జావా మెమొరీ వ్యవస్థలో గుర్తించిన ఈ లోపానికి 'జావా4షెల్' (Java4Shell) అని పేరు పెట్టింది. ఈ లోపాన్ని హ్యాకర్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని సంస్థ హెచ్చరించింది.
వివరాలు
హ్యాకర్లకు అవకాశం కల్పించే లోపం
జావా మెమొరీ వ్యవస్థలోని ఈ భద్రతా లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు అవాంఛిత ప్రోగ్రామ్‌లను రన్ చేసే అవకాశం ఉందని కాలిఫ్ తెలిపింది.
గతంలోనూ ఇదే సంస్థ మరో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన పీహెచ్‌పీలో భారీ భద్రతా లోపాన్ని గుర్తించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది.
1995లో విడుదలైన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండె చప్పుడు వంటిదని కాలిఫ్ అభివర్ణించింది.
అంతటి కీలకమైన వ్యవస్థలో లోపం బయటపడటం సాఫ్ట్‌వేర్ రంగంలో ఆందోళన కలిగిస్తోంది.
వివరాలు
ఫార్చ్యూన్ 500 సంస్థల్లో 90 శాతం వినియోగం
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై ఆధారపడుతున్నాయి.
ఫార్చ్యూన్ 500 జాబితాలోని సంస్థల్లో దాదాపు 90 శాతం తమ వెబ్‌సైట్ల కోసం జావాను వినియోగిస్తున్నాయి.
వీటిలో యాపిల్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలతోపాటు బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి.
దీంతో ఈ లోపం ప్రభావం విస్తృతంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఒరాకిల్ నుంచి క్రిటికల్ ప్యాచ్ అప్‌డేట్
జావా యజమాని అయిన ఒరాకిల్ (Oracle) సంస్థ ఈ లోపంపై నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే, దీనికి సంబంధించి క్రిటికల్ ప్యాచ్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ లోపాన్ని ఉపయోగించుకొని ఇప్పటికే ఏమైనా సైబర్ దాడులు జరిగాయా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
అమెరికాలోనూ సాంకేతిక సమస్యలు
మరోవైపు అమెరికా మంగళవారం వరుస సైబర్, సాంకేతిక సమస్యలతో సతమతమైంది. యాపిల్, గూగుల్ సాఫ్ట్‌వేర్లు తీవ్ర సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.
అత్యంత కీలకమైన అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) కమ్యూనికేషన్లలోనూ పలు సమస్యలు తలెత్తినట్లు సమాచారం.