
Mamaearth IPO: మామాఎర్త్ ఐపీఓ.. తొలిరోజు 12శాతం మంది సబ్‌స్క్రైబ్
ఈ వార్తాకథనం ఏంటి
బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ మాతృ సంస్థ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ ఐపీఓ మంగళవారం ప్రారంభమైంది.
ఐపీఓ ద్వారా రూ.1,701 కోట్లును సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుంది.
ఈ క్రమంలో ఐపీఓ తొలి రోజు 12 శాతం మంది బిడ్డింగ్ వేశారు.
మొత్తం షేర్ల పరిమాణం 2.89 కోట్లు కాగా.. తొలి రోజు వినియోగదారులు 33.3 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
రిటైల్ పెట్టుబడిదారులు తమ కోసం కేటాయించిన భాగంలో 29 శాతం వాటాల కోసం బిడ్‌లు వేశారు.
సంస్థాగతేతర పెట్టుబడిదారులు వారికి రిజర్వ్ చేసిన కోటాలో 2 శాతం షేర్లను కొనుగోలు చేశారు. అలాగే క్యూఐబీ కోటాలో 10 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యింది.
ఐపీఓ
నవంబర్ 10న లిస్ట్ కానున్న షేర్లు
హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ బిడ్ వేయడానికి నవంబర్ 2 ఆఖరు తేదీగా సెబీ పేర్కొంది.
షేరు ధరను రూ. 308- 324గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్టాక్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) రెండింటిలోనూ లిస్ట్ కాబోతోంది. ఒక్క లాట్‌కు 46 షేర్లు వస్తాయి. నవంబర్ 10న షేర్లు లిస్ట్ కానున్నాయి.
మామాఎర్త్ కంపెనీ రూ.1,701 కోట్లలో.. ఈక్విటీ ఇష్యూ విలువ ద్వారా రూ.365 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ. 1,336 కోట్లను సేకరించాలని నిర్ణయించింది.
కంపెనీ వ్యవస్థాపకులు వరుణ్ అలగ్, గజల్ అలగ్, పెట్టుబడిదారులు కునాల్ బహ్ల్, శిల్పా శెట్టి, రిషబ్ మరివాలాతో కలిసి ఓఎఫ్ఎస్‌లో తమ వాటాలను పాక్షికంగా ఉపసంహరించుకోనున్నారు.