Loading...
Stock Market: స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర.. వరుసగా నాలుగో రోజూ పడిపోయిన సూచీలు
స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర.. వరుసగా నాలుగో రోజూ పడిపోయిన సూచీలు

Stock Market: స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర.. వరుసగా నాలుగో రోజూ పడిపోయిన సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. దీంతో రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సూచీలు.. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి.

వివరాలు 

సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లోకి

బీఎస్ఈ సెన్సెక్స్ గత సెషన్‌లో 73,249.39 పాయింట్ల వద్ద ముగియగా.. శుక్రవారం ఉదయం 73,665.64 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

ప్రారంభంలో లాభాల బాటలో సాగిన సూచీ.. ఆ తర్వాత ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 72,452.37 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది.

అయితే, చివరి గంటల్లో కొంతమేర కోలుకుంది. అయినప్పటికీ 125.56 పాయింట్ల నష్టంతో 73,123.83 వద్ద స్థిరపడింది.

మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా నష్టాలతో ముగిసింది. ఈ సూచీ 171.25 పాయింట్లు కోల్పోయి 22,516.40 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయిపై కూడా ఒత్తిడి కొనసాగింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.94.94గా నమోదైంది.

వివరాలు 

ఈ షేర్లకు నష్టాలు.. ఆ షేర్లకు లాభాలు

సెన్సెక్స్-30 సూచీలో టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, టెక్ మహీంద్రా, బీఈఎల్ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి.

మరోవైపు, ఎటర్నల్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

ముడిచమురు ధరలు పైపైకి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మరింత పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 114 డాలర్లకు చేరింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడవచ్చనే ఆందోళనలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర 4,024 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT