LOADING...
Microsoft: మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. నెలలోనే 570 బిలియన్ డాలర్ల నష్టం!
మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. నెలలోనే 570 బిలియన్ డాలర్ల నష్టం!

Microsoft: మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. నెలలోనే 570 బిలియన్ డాలర్ల నష్టం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్‌కు జూన్ నెల తీవ్ర నిరాశను మిగిల్చింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కంపెనీ షేర్ విలువ క్షీణించింది. జూన్ నెలలో మాత్రమే మైక్రోసాఫ్ట్ షేర్ దాదాపు 17 శాతం పడిపోవడంతో,సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 570 బిలియన్ డాలర్లకు పైగా తగ్గిపోయింది. 2000 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో కంపెనీ విలువ క్షీణించడం ఇదే తొలిసారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. ఈ విభాగంలో ముందంజలో నిలవాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.

వివరాలు 

మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయిన అజూర్ క్లౌడ్

డేటా సెంటర్ల విస్తరణ, ఏఐ చిప్‌ల అభివృద్ధి, ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాల కోసం సంస్థ బిలియన్ డాలర్లను వెచ్చించింది. అయితే ఈ భారీ పెట్టుబడులకు తగిన స్థాయిలో ఆదాయం, లాభాలు వస్తాయా అనే సందేహాలు మదుపర్లలో పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో అజూర్ క్లౌడ్ వ్యాపారానికి సంబంధించిన గణాంకాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో మదుపర్లలో ఆందోళన మరింత పెరిగింది. ఏఐ పెట్టుబడులపై పెరుగుతున్న వ్యయం, ఆశించిన స్థాయిలో వ్యాపార వృద్ధి కనిపించకపోవడం, అజూర్ పనితీరుపై నిరాశ వంటి అంశాలు కలిసి మైక్రోసాఫ్ట్ షేర్‌పై ఒత్తిడిని పెంచాయి. ఈ పరిస్థితుల్లో పలువురు పెట్టుబడిదారులు తమ వాటాలను విక్రయించడంతో కంపెనీ మార్కెట్ విలువ భారీగా తగ్గిపోయింది.

Advertisement