Loading...
Modi government : విదేశీ ఆస్తులు, వెల్లడించని ఆదాయంపై ప్రత్యేక డిస్క్లోజర్‌ స్కీమ్‌.. మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం
విదేశీ ఆస్తులు, వెల్లడించని ఆదాయంపై ప్రత్యేక డిస్క్లోజర్‌ స్కీమ్‌.. మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం

Modi government : విదేశీ ఆస్తులు, వెల్లడించని ఆదాయంపై ప్రత్యేక డిస్క్లోజర్‌ స్కీమ్‌.. మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 15, 2026
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదేశాల్లో ఉన్న నిర్దిష్ట ఆస్తులు, ఇప్పటివరకు వెల్లడించని ఆదాయ వివరాలను పన్ను చెల్లింపుదారులు ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డిస్క్లోజర్‌ పథకాన్ని తీసుకొచ్చింది. 'ఫారిన్‌ అసెట్స్‌ ఆఫ్‌ స్మాల్‌ ట్యాక్స్‌పేయర్స్‌ డిస్క్లోజర్‌ స్కీమ్‌ రూల్స్‌-2026' పేరుతో రూపొందించిన ఈ నిబంధనలను ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ఆగస్టు 16 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఈ పథకం కింద అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారులు 2026 డిసెంబర్‌ 31 వరకు ఆన్‌లైన్‌లో తమ ప్రకటనలను దాఖలు చేయవచ్చు. ఇందుకోసం రెండు కేటగిరీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా విభాగాలకు వర్తించే అర్హత పరిమితులు వరుసగా రూ.1 కోటి, రూ.5 కోట్లుగా నిర్ణయించారు.

వివరాలు

విదేశీ ఆస్తుల వెల్లడికి రెండు కేటగిరీలు..

మొదటి కేటగిరీలో రూ.1 కోటి వరకు విలువైన వెల్లడించని విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని ప్రకటించవచ్చు.

ఈ మార్గాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన విలువలో 60 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సగం పన్నుగా, మిగిలిన సగం జరిమానాగా చెల్లించాలి.

రెండో కేటగిరీలో గరిష్ఠంగా రూ.5 కోట్ల విలువ కలిగిన కొన్ని నిర్దిష్ట విదేశీ ఆస్తులను ప్రకటించే అవకాశం ఉంటుంది.

ఒక వ్యక్తి తాను ప్రవాసిగా ఉన్న సమయంలో విదేశాల్లో సంపాదించిన ఆదాయంతో ఆస్తులను కొనుగోలు చేసి, అనంతరం భారత్‌లో నివాసిగా మారిన తర్వాత వాటిని వెల్లడించకపోయినా.. లేదా ఆ ఆస్తుల ఆదాయాన్ని ఇప్పటికే భారత్‌లో పన్ను పరిధిలోకి తీసుకొచ్చినా.. నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఈ కేటగిరీని ఉపయోగించుకోవచ్చు.

వివరాలు

రూ.5 కోట్ల పరిమితి మొత్తం అర్హత కలిగిన ఆస్తుల విలువకే..

రెండో కేటగిరీకి సంబంధించి రూ.1 లక్ష ఫ్లాట్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది 2026 ఆర్థిక చట్టంలో నిర్దేశించిన కొన్ని షరతులకు లోబడి ఉంటుంది.

అయితే ఈ పథకం ద్వారా వెల్లడించని మొత్తం విదేశీ సంపదకు ఎలాంటి సాధారణ మాఫీ లభిస్తుందని భావించకూడదు.

ముఖ్యంగా, రూ.5 కోట్ల పరిమితి ఒక్కో ఆస్తికి కాకుండా.. ఈ పథకం కింద అర్హత పొందే అన్ని ఆస్తుల కలిపిన మొత్తం విలువకు వర్తిస్తుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తికి విదేశాల్లో రూ.2.5 కోట్ల విలువైన మ్యూచువల్‌ ఫండ్స్‌, రూ.4 కోట్ల విలువైన విదేశీ సెక్యూరిటీస్‌ ఉన్నాయని అనుకుందాం.

ఈ రెండింటి మొత్తం విలువ రూ.6.5 కోట్లు అవుతుంది. ఇది రూ.5 కోట్ల పరిమితిని మించిపోతుంది.

ADVERTISEMENT