LOADING...
Multibagger Stock: 6 ఏళ్లలో 3,600% లాభాలు.. ఈ స్టాక్ పెట్టుబడిదారులకు గోల్డ్ ఛాన్స్!
6 ఏళ్లలో 3,600% లాభాలు.. ఈ స్టాక్ పెట్టుబడిదారులకు గోల్డ్ ఛాన్స్!

Multibagger Stock: 6 ఏళ్లలో 3,600% లాభాలు.. ఈ స్టాక్ పెట్టుబడిదారులకు గోల్డ్ ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

పెట్టుబడిదారులు సాధారణంగా కాలక్రమేణా భారీ లాభాలను అందించే మల్టీబ్యాగర్ స్టాక్‌ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇటువంటి స్టాక్‌లు పెట్టుబడిని అనేక రెట్లు పెంచే సామర్థ్యం కలిగి ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే వేల శాతం రాబడులను అందించి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాయి. తాజాగా అలాంటి ఒక స్టాక్ వార్తల్లో నిలిచింది. గత ఆరు సంవత్సరాల్లో ఇది సుమారు 3,600% వరకు ఆకట్టుకునే రాబడులను ఇచ్చింది. అంతేకాకుండా, ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెంచురా ఈ షేర్లు భవిష్యత్తులో మరో 80% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

వివరాలు

పెట్టుబడిదారులను సంపన్నులను చేసిన స్టాక్

ఒరియన్‌ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్ అనే సంస్థ తన షేర్ల ద్వారా పెట్టుబడిదారులకు విశేష లాభాలను అందించింది. ఈ కంపెనీ స్టాక్ మే 2020 నుంచి దాదాపు 39 రెట్లు పెరిగి, బలమైన మల్టీబ్యాగర్‌గా నిలిచింది. గణాంకాల ప్రకారం గత ఆరేళ్లలో ఈ షేర్ సుమారు 3,800% వరకు రాబడిని ఇచ్చింది. అప్పట్లో రూ.20 వద్ద ఉన్న షేర్ ధర, ప్రస్తుతం రూ.781.50 వరకు ఎగబాకింది. అయితే ఇటీవల ఈ స్టాక్‌లో కొంత మందగమనం కనిపిస్తోంది. కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 55% వరకు తగ్గాయి.

వివరాలు

బ్రోకరేజ్ సంస్థ విశ్వాసం

బ్రోకరేజ్ సంస్థ వెంచురా, ఒరియన్‌ప్రో సొల్యూషన్స్ షేర్లపై 'కొనుగోలు' (Buy) రేటింగ్‌తో కవరేజీ ప్రారంభించింది. ఈసంస్థ గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్(AFC), డేటా సెంటర్ల వంటి కీలక రంగాల్లో బలమైన స్థానం కలిగి ఉందని పేర్కొంది. కంపెనీకి ఉన్న ఆధునిక ప్లాట్‌ఫారమ్‌లు, పరిశోధన ఆధారిత అభివృద్ధి దృష్ట్యా భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. క్లౌడ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డేటా లోకలైజేషన్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, FY35 నాటికి భారతదేశంలో డేటా సెంటర్ సామర్థ్యం 15-17 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే కాలంలో ఒరియన్‌ప్రో సొల్యూషన్స్ స్టాక్‌లో సానుకూల మార్పులు కనిపించే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement