Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి
దేశవ్యాప్తంగా డీప్'ఫేక్ కలకలం సృష్టిస్తోంది. కేవలం సినీసెలబ్రిటీలను మాత్రమే కాదు, రాజకీయ వ్యాపార ప్రముఖులను సైతం ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే టాటా టైకూన్ రతన్ టాటా పేరిట వచ్చిన డీప్ ఫేక్ మరువకముందే, మరో దిగ్గజ పారిశ్రామికవేత్త మీద డీప్‌ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి ఇటీవలే డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ట్రేడింగ్ యాప్‌లకు నారాయణమూర్తి ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయని, అవి ఫేక్ అని వాటిని ఎవరూ నమ్మకూడదని ట్వీట్ ద్వారా కోరారు. కొన్ని వెబ్‌సైట్లు డీప్ ఫేక్ వీడియోలతో మోసం చేస్తున్నాయని, అలాంటి సందర్భం ఎదురైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.