LOADING...
NCLAT: అదానీ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్.. వేదాంతకు షాక్.. NCLAT కీలక తీర్పు
అదానీ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్.. వేదాంతకు షాక్.. NCLAT కీలక తీర్పు

NCLAT: అదానీ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్.. వేదాంతకు షాక్.. NCLAT కీలక తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దివాలా దశలో ఉన్న జైప్రకాశ్ అసోసియేట్స్‌కు సంబంధించిన ₹15,000 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌పై NCLAT కీలక నిర్ణయం తీసుకుంది. వేదాంత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన రుణదాతల కమిటీ నిర్ణయంలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేసింది. చైర్‌పర్సన్ న్యాయమూర్తి అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ అప్పీళ్లను తిరస్కరించింది. బిడ్డింగ్ పూర్తయ్యాక వేదాంత పంపిన మార్పులు పరిగణలోకి తీసుకోకపోవడం సరైనదేనని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.

వివరాలు 

అదానీ ప్లాన్‌కు రుణదాతల ప్రాధాన్యం

ఈ వ్యవహారం ఇప్పటికే NCLTలో అదానీ ప్లాన్‌కు అనుకూలంగా వెళ్లగా, తాజా NCLAT తీర్పుతో వేదాంతకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోకుండా NCLAT విచారణ కొనసాగించాలని సూచించిన విషయం తెలిసిందే. వేదాంత తన ₹17,000 కోట్ల బిడ్ మెరుగైనదని వాదించినా, ముందస్తు చెల్లింపులు, త్వరిత అమలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రుణదాతలు అదానీ ప్లాన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

Advertisement