NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Rs 2000 Notes: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..రూ.6,970 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి
    తదుపరి వార్తా కథనం
    Rs 2000 Notes: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..రూ.6,970 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి
    రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

    Rs 2000 Notes: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..రూ.6,970 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 05, 2024
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2 వేల రూపాయల నోట్ల గురించి సోమవారం రోజున, ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

    బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ 2 వేల నోట్లలో దాదాపు 98.04 శాతం చెలామణీకి వచ్చిందని తెలిపింది.

    ఇంకా, ప్రజల వద్ద సుమారు రూ. 6970 కోట్లు నోట్లు ఉండగా, ఆర్బీఐ గత ఏడాది మే 19న చలామణీ నుంచి 2 వేల నోట్లను ఉపసంహరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    అప్పటికి సర్క్యులేషన్‌లో ఉన్న 2 వేల రూపాయల నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు.

    వివరాలు 

    ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పరిమితం 

    ఆర్బీఐ ప్రకటన అనంతరం, ప్రజలు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చడం లేదా తమ ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించారు.

    మొదటగా, అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ సేవలను అందించాయి. ప్రస్తుతం, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే 2 వేల నోట్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది.

    హైదరాబాద్ సహా మొత్తం 19 ఆర్బీఈ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్లు అప్పగించవచ్చు, అంతేకాకుండా వాటిని ఇతర నోట్లలోకి కూడా మార్చవచ్చు.

    2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునే అవకాశం ఉంది.

    క్రమక్రమంగా చలామణీలో ఉన్న నోట్ల విలువ తగ్గడంతో, ఈ అవకాశాన్ని ఇప్పుడు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పరిమితం చేసింది.

    వివరాలు 

    ప్రజల వద్ద ఇంకా రూ. 6970 కోట్ల విలువైన 2 వేల నోట్లు

    2016 నవంబరులో, కేంద్ర ప్రభుత్వం చలామణీలో ఉన్న రూ. 500 మరియు రూ. 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే, ఆ సమయంలో 2 వేల రూపాయల నోటు ప్రవేశపెట్టబడింది.

    ఇప్పటికీ, 2 వేల నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ, అవి రద్దు చేయబడలేదు. ప్రస్తుతం చెల్లుబాటు కరెన్సీగా భావిస్తున్నాయి.

    ప్రజల వద్ద ఇంకా రూ. 6970 కోట్ల విలువైన 2 వేల నోట్లు ఉన్నాయని అర్ధమవుతోంది. అయితే, ఈ నోట్లను తిరిగి తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడం లేదు.

    దీంతో, ఆర్బీఐ 100 శాతం నోట్లు తిరిగి వస్తాయని ఆశిస్తోంది.

    వివరాలు 

    రూ. 1000 నోట్లను మళ్లీ తీసుకొచ్చే వార్తలు

    2 వేల నోట్లు పూర్తిగా తిరిగి వచ్చిన తర్వాత అవి రద్దు చేయబడనున్నాయి. మరోవైపు, రూ. 1000 నోట్లను మళ్లీ తీసుకొచ్చే వార్తలు కూడా వినిపిస్తున్నాయి, అయితే దీనిపై స్పష్టత లభించలేదు.

    ఆర్బీఐ ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ

    తాజా

    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం
    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు

    ఆర్ బి ఐ

    RBI: ఆర్‌బీఐ కొత్త ప్లాన్‌.. ఆన్‌లైన్ లావాదేవీలకు ఇకపై OTP అవసరం లేదు..  బిజినెస్
    Paytm: భారీగా పేటీఎం షేర్ల పతనం.. రూ.26,000 కోట్ల ఆవిరి  పేటియం
    RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి  7 శాతం.. ఆర్‌బీఐ అంచనా వృద్ధి రేటు
    Payments Bank : పేమెంట్స్ బ్యాంకులతో కస్టమర్లకు ఇబ్బంది.. ఆర్బీఐకి భారీగా ఫిర్యాదులు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025