New Income Tax Policy : ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను రూల్స్.. సీటీసీపై టాక్స్! జీతంపై ప్రభావం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఇప్పటివరకు ప్రాథమిక జీతం (బేసిక్ సాలరీ) ఆధారంగా పన్ను లెక్కించగా, ఇకపై కంపెనీ ఉద్యోగికి అందించే మొత్తం ప్రయోజనాలు కలిపిన CTC (Cost to Company) ఆధారంగా పన్ను విధించనున్నారు. దీంతో గృహ వసతి, కంపెనీ కార్లు, బహుమతులు, వివిధ అలవెన్సులు వంటి అంశాలు కూడా పన్ను పరిధిలోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ కల్పించే నివాస వసతిపై నగరాన్ని బట్టి జీతంలో 5 నుంచి 10 శాతం వరకు పన్ను విలువగా నిర్ణయిస్తారు.
Details
పదవీ విరమణ నిధుల విషయంలో కూడా మార్పులు
అలాగే కంపెనీ చెల్లించే అద్దె లేదా జీతంలో 10 శాతం—ఈ రెండింటిలో తక్కువ మొత్తాన్ని పన్ను కోసం పరిగణనలోకి తీసుకుంటారు. కంపెనీ ఇచ్చే వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తే, చిన్న కారుకు నెలకు రూ.5,000, పెద్ద కారుకు రూ.7,000, డ్రైవర్‌కు అదనంగా రూ.3,000ను పన్ను విలువగా లెక్కించనున్నారు. ఇక పదవీ విరమణ నిధుల విషయంలో కూడా మార్పులున్నాయి. కంపెనీ ఫీఎఫ్, ఎన్‌ఫీఎస్ వంటి స్కీమ్స్‌కు సంవత్సరానికి రూ.7.5 లక్షలకుపైగా చెల్లిస్తే, ఆ అదనపు మొత్తంపై పన్ను విధిస్తారు. ఉద్యోగులకు ఇచ్చే బహుమతులపై కూడా పరిమితి విధించారు.
Details
సంవత్సరానికి రూ.15,000 వరకు మాత్రమే పన్ను
సంవత్సరానికి రూ.15,000 వరకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా తక్కువ వడ్డీతో ఇచ్చే రుణాలపై మార్కెట్ వడ్డీ రేటుతో ఉన్న తేడాను కూడా పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ మార్పులతో ఫామ్-16, జీత స్లిప్‌లలో కొత్త వివరాలు చేర్చబడతాయి. మొత్తం మీద ఈ కొత్త విధానం పారదర్శకతను పెంచే దిశగా తీసుకున్న చర్యగా భావిస్తున్నప్పటికీ, ఉద్యోగుల చేతికి వచ్చే నికర జీతం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.