Page Loader
Stock Market :భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు..  సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌ 
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు

Stock Market :భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు..  సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ ప్రకటన కారణంగా ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ప్రారంభంలో స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ, సూచీలు ప్రస్తుతం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

వివరాలు 

ప్రస్తుత మార్కెట్ స్థితి 

ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 500 పాయింట్లు నష్టపోయి 75,837 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 183 పాయింట్ల నష్టంతో 23,066 వద్ద ఉంది. సెన్సెక్స్-30 సూచీలో టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్‌బ్యాంక్, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారీ ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.

వివరాలు 

అమెరికా మార్కెట్ల కుదేలు 

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం అమెరికా మార్కెట్లపై తీవ్రంగా పడింది. డోజోన్స్ 3.98%, ఎస్‌అండ్‌పీ 500 4.84%, నాస్‌డాక్ 5.97% నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా అదే ధోరణిలో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్‌ఎక్స్ 2.06%, జపాన్ నిక్కీ 2.64%, హాంకాంగ్ హాంగ్ సెంగ్ 1.52% నష్టాల్లో ఉన్నాయి. షాంఘై మార్కెట్ మాత్రం స్థిరంగా ట్రేడవుతోంది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థతి 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 66.46 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సుకు 3,112.70 డాలర్ల వద్ద ఉంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే 84.99 వద్ద ప్రారంభమైంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.2,806 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.221 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.