Page Loader
Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్‌ 76,655
లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్‌ 76,655

Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్‌ 76,655

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో సూచీలు పాజిటివ్‌గా ప్రదర్శన పెంచుతున్నాయి. ఇండెక్స్‌లో ప్రధాన కంపెనీలు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలకు మద్దతు లభించింది. ఈ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 231 పాయింట్ల లాభంతో 76,655 వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 23,245 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌,అదానీ పోర్ట్స్,ఏషియన్‌ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయ. సన్‌ఫార్మా, జొమాటో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌,మారుతీ సుజుకీ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు 

బంగారం ఔన్సు 2,780.40 డాలర్లు

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 78.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,780.40 డాలర్లుగా ఉంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ.5,463 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) మాత్రం నికరంగా రూ.3,713 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.