LOADING...
RBI: వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేకుండా 5.5% స్థిరీకరణ
వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేకుండా 5.5% స్థిరీకరణ

RBI: వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేకుండా 5.5% స్థిరీకరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 01, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరిపతి సమీక్షా నిర్ణయాలను ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా, రెపోరేట్‌ను వరుసగా రెండోసారి 5.5 శాతం వద్దే ఉంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో RBI 0.25 శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించగా, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా మూడు వరుస సమీక్షల్లో రెపోరేట్ మొత్తం 1శాతం తగ్గింది. కానీ ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కారణంగా ఆగస్టులో రెపోరేట్‌ను యథాతథంగా 5.5 శాతం వద్ద నిలిపింది.

Details

అక్టోబర్ లో ద్రవ్యోల్బణం మరింత తక్కువ ఉండే అవకాశం

2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ఆధారిత సూచిక (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉండే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. జీఎస్టీ హేతుబద్దీకరణ కారణంగా అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం మరింత తక్కువ ఉండే అవకాశం ఉంది. దాంతో, రెపోరేట్‌ను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు హేతుబద్ధత ఉన్నప్పటికీ, RBI ఈసారి రేట్లను యథాతథంగా కొనసాగించడం నిర్ణయించింది.