Page Loader
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల సవరణ లేనట్టే.. పెంపుదలను వాయిదా వేసిన కంపెనీ
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల సవరణ లేనట్టే.. పెంపుదలను వాయిదా వేసిన కంపెనీ

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల సవరణ లేనట్టే.. పెంపుదలను వాయిదా వేసిన కంపెనీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 12, 2023
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భార‌త్‌లో ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒక‌టిగా నిలిచిన ఇన్ఫోసిస్ కంపెనీలో వేతన పెంపుపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియ‌ర్ మేనేజ్‌మెంట్ లెవెల్ కంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులందరికీ వేత‌న పెంపును వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఏటా ఏప్రిల్ నుంచి కంపెనీలో పనిచేసే నిపుణులు, ఉద్యోగులకు సంస్థ వేత‌న పెంపును నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం 2023-2024, తొలి క్వార్ట‌ర్‌ (జూన్‌)లో వేత‌న పెంపుపై అర్హులైన ఉద్యోగుల‌కు కొత్త వేతనం అందాల్సి ఉంది. ఈసారి మాత్రం స‌వ‌రించిన వేత‌నాలు అందట్లేదని ప‌లువురు ఉద్యోగులు పేర్కొన్నారు.

details

కొత్త వేతనం అమ‌లు తేదీలు మాకు తెలియదు : ఉద్యోగులు

మరోవైపు వేత‌న పెంపుదల ఎప్ప‌ట్నుంచి అమ‌ల‌ు చేయనున్నారనే విషయం త‌మ‌కు చెప్పలేదని కంపెనీ ఉద్యోగులు అంటున్నారు. ఈ విష‌య‌ంపై తమకు ఎటువంటి అధికారిక స‌మాచారం అంద‌లేద‌ని పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలు లే ఆఫ్స్‌కే మొగ్గుచూపిస్తుండటంతో ఐటీ రంగంలో స్తబ్దత నెలకొంది. స్ధూల ఆర్ధిక ప‌రిస్ధితుల్లో అనిశ్చిత వాతావ‌ర‌ణం ఏర్పడ్డ సందర్భంలో ఇన్ఫోసిస్‌లో వేత‌నాల పెంపుపై సందిగ్ధం నెల‌కొంది. దీంతో టెకీల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. 2020లో కొవిడ్‌-19 వ్యాప్తి సమయంలోనూ సదరు కంపెనీ వేత‌న పెంపును వాయిదా వేసింది. అనంతరం పరిస్థితులు కుదురుకున్నాక, ఆపై ఏడాది అంటే 2021 జ‌న‌వ‌రిలో సంస్థ వేత‌న పెంపుదలను ప్రకటించడం విశేషం.