Loading...
Bahram Vakil: టాటా ఇన్వెస్ట్‌మెంట్ ఛైర్మన్‌గా వైదొలిగిన నోయల్ టాటా.. కొత్త ఛైర్మన్‌గా బహ్రామ్ వకీల్.. ఆయనెవరంటే?
కొత్త ఛైర్మన్‌గా బహ్రామ్ వకీల్.. ఆయనెవరంటే?

Bahram Vakil: టాటా ఇన్వెస్ట్‌మెంట్ ఛైర్మన్‌గా వైదొలిగిన నోయల్ టాటా.. కొత్త ఛైర్మన్‌గా బహ్రామ్ వకీల్.. ఆయనెవరంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి నోయల్ టాటా వైదొలిగారు. 16 ఏళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహించిన ఆయన.. బుధవారం (నవంబర్ 11) పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ప్రముఖ న్యాయవాది, AZB & పార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకుడు బహ్రామ్ ఎన్. వకీల్ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అసలు ఎవరీ బహ్రామ్ వకీల్? ఆయన నియామకంతో టాటా గ్రూప్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి?

వివరాలు 

నోయల్ టాటా ఎందుకు వైదొలిగారు?

టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ బోర్డులో నోయల్ టాటా 2004లో సభ్యుడిగా చేరారు.

2010లో కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.దాదాపు 16ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన.. నవంబర్ 11న పదవీ విరమణ చేశారు.

టాటా గ్రూప్ పాలన మార్గదర్శకాల ప్రకారం నాన్-ఎగ్జిక్యూటివ్,నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ల పదవీ విరమణ వయసు 70ఏళ్లు.

నోయల్ టాటా ఈ వయసుకు చేరుకోవడంతో నిబంధనల ప్రకారం బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

టాటా గ్రూప్‌కు చెందిన ఆరు కంపెనీల బోర్డుల్లో మార్పులు చేపట్టే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రెంట్,వోల్టాస్,టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ సంస్థల బోర్డుల నుంచి నోయల్ టాటా వైదొలగుతున్నారు.

టాటా స్టీల్, టైటన్ కంపెనీల్లోనూ బోర్డు స్థాయిలో మార్పులు జరిగే అవకాశం ఉంది.

వివరాలు 

నోయల్ టాటా ఎందుకు వైదొలిగారు?

నోయల్ టాటా తన పదవి నుంచి తప్పుకోనున్న విషయాన్ని ముందుగానే వెల్లడించారు.

2026 జూన్‌లో ట్రెంట్ వార్షిక సర్వసభ్య సమావేశంలోనే ఈ విషయాన్ని వాటాదారులకు తెలిపారు.

అనంతరం వోల్టాస్ వార్షిక సమావేశంలోనూ ఇదే విషయాన్ని ప్రకటించారు. ఆ సమావేశమే కంపెనీ ఛైర్మన్‌గా తనకు చివరిదని స్పష్టం చేశారు.

టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌కు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ పదవీ విరమణ తర్వాత గౌరవ ఛైర్మన్ ఎమిరిటస్‌గా నియమించారు.

అయితే నోయల్ టాటా ఇతర కీలక బాధ్యతల్లో కొనసాగనున్నారు.

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా,టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ బోర్డులో టాటా ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

బహ్రామ్ వకీల్ ఎవరు?

టాటా ట్రస్ట్స్, దాని అనుబంధ ట్రస్టులకు కలిపి టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా ఉంది.

బహ్రామ్ ఎన్. వకీల్ భారతదేశంలోని ప్రముఖ కార్పొరేట్ న్యాయవాదుల్లో ఒకరు.

దేశంలోని ప్రముఖ న్యాయ సంస్థల్లో ఒకటైన AZB & పార్ట్‌నర్స్‌ను స్థాపించిన వారిలో ఆయన కూడా ఉన్నారు.

కార్పొరేట్ సంస్థల పునర్వ్యవస్థీకరణ, దివాలా పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టు ఫైనాన్స్ వంటి అంశాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది.

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లాస్ (LLM) డిగ్రీ పొందారు.

భారత్‌లో న్యాయవాదిగా పనిచేయడానికి అర్హత కలిగి ఉండటంతో పాటు న్యూయార్క్ స్టేట్ బార్‌లోనూ సభ్యుడిగా ఉన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

బహ్రామ్ వకీల్ ఎవరు?

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలు, దివాలా ప్రక్రియలు, బ్యాంకులు, పెట్టుబడి సంస్థలకు సంబంధించిన సంక్లిష్ట న్యాయపరమైన అంశాల్లో ఆయన సలహాలు అందించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా పరిష్కార ప్రక్రియకు పంపిన పలు పెద్ద సంస్థల వ్యవహారాల్లోనూ ఆయన పనిచేశారు.

అంతర్జాతీయ న్యాయ సంస్థలు కూడా ఆయన నైపుణ్యాలను గుర్తించాయి.

'ది వరల్డ్స్ లీడింగ్ లాయర్స్ ఫర్ బిజినెస్' సంస్థ ఆయనను ఖాతాదారులకు తెలివైన, నమ్మకమైన, ఆచరణాత్మక సలహాలు ఇచ్చే న్యాయవాదిగా అభివర్ణించింది.

చాంబర్స్ అండ్ పార్ట్‌నర్స్ గ్లోబల్ కూడా చర్చలు, ఒప్పందాల విషయంలో ఆయనకున్న నైపుణ్యాలను ప్రశంసించింది.

వివరాలు 

కార్పొరేట్ న్యాయవాది నుంచి టాటా బోర్డు వరకు..

భారత కార్పొరేట్ న్యాయ రంగంలో ప్రముఖ స్థాయికి చేరుకోవడానికి ముందు బహ్రామ్ వకీల్ అమెరికాలోని డెబెవాయిస్ అండ్ ప్లింప్టన్, అనంతరం శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని మెక్‌కట్చెన్, డోయల్, బ్రౌన్ అండ్ ఎనర్సెన్ సంస్థల్లో అసోసియేట్‌గా పనిచేశారు.

1991 నుంచి 2001 వరకు ముంబయికి చెందిన లిటిల్ అండ్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత AZB & పార్ట్‌నర్స్‌ను స్థాపించారు.

ఈ సంస్థలో వ్యవస్థాపక భాగస్వామిగా కొనసాగుతూ కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టు ఫైనాన్స్, దివాలా పరిష్కారాలకు సంబంధించిన కేసులపై పనిచేశారు.

వివరాలు 

కార్పొరేట్ న్యాయవాది నుంచి టాటా బోర్డు వరకు..

2010లో భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన యూకే సిన్హా కమిటీ వర్కింగ్ గ్రూప్‌లో సభ్యుడిగా నియమితులయ్యారు.

2011లో సెబీ సలహా బృందంతో పాటు ఆర్థిక రంగ చట్టాల సంస్కరణల కమిటీలోనూ ఆయనకు సంబంధం ఉంది.

ఆర్థిక నియంత్రణలు, విధానాల రూపకల్పనలో ఆయన పాత్రకు ఇవి నిదర్శనంగా నిలిచాయి.

అంతేకాకుండా కార్పొరేట్ రుణాల ద్వితీయ మార్కెట్ అభివృద్ధికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లోనూ పనిచేశారు.

దివాలా చట్టాలు, ఆర్థిక రంగ నియంత్రణలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన సంస్కరణలపై ఆయనకు మంచి అవగాహన ఉంది.

వివరాలు 

టాటా గ్రూప్‌కు వకీల్ నియామకం ఎందుకు కీలకం?

బహ్రామ్ వకీల్ నియామకాన్ని టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ నియంత్రణ సంస్థలకు సమర్పించిన అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది.

నవంబర్ 11న వ్యాపార కార్యకలాపాలు ముగిసిన తర్వాత నోయల్ టాటా పదవీ విరమణ అమల్లోకి వచ్చింది.

నవంబర్ 12 నుంచి బహ్రామ్ వకీల్ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. వకీల్‌కు టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే అనుబంధం ఉంది.

ఆ సంస్థలో గతంలో వైస్ ఛైర్మన్‌గా, స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. 2025 మార్చిలో కంపెనీ బోర్డులో చేరారు. అయితే మింట్ అక్టోబర్ 29న ప్రచురించిన కథనంలో 2026 మార్చి నుంచి వైస్ ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నట్లు పేర్కొంది.

వివరాలు 

టాటా గ్రూప్‌కు వకీల్ నియామకం ఎందుకు కీలకం?

టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు టాటా గ్రూప్‌కు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా కూడా వకీల్ నియమితులయ్యారు.

ఈ నియామకం కూడా నవంబర్ 12 నుంచే అమల్లోకి రానుంది. ట్రెంట్ సంస్థ వెస్ట్‌సైడ్, జుడియో, ఉత్సా, స్టార్ బజార్ వంటి రిటైల్ బ్రాండ్లను నిర్వహిస్తోంది.

కార్పొరేట్ చట్టాలు, ఆర్థిక వ్యవహారాలు, సంస్థల పునర్వ్యవస్థీకరణలో సుదీర్ఘ అనుభవం ఉన్న వకీల్.. టాటా గ్రూప్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT