Loading...
Noel Tata: చంద్రశేఖరన్‌ కొనసాగింపుపై నోయెల్‌ టాటా అభ్యంతరం.. కారణాలివే!
చంద్రశేఖరన్‌ కొనసాగింపుపై నోయెల్‌ టాటా అభ్యంతరం.. కారణాలివే!

Noel Tata: చంద్రశేఖరన్‌ కొనసాగింపుపై నోయెల్‌ టాటా అభ్యంతరం.. కారణాలివే!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లు కొనసాగించాలన్న నిర్ణయంపై టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రశేఖరన్‌ స్వయంగా పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, ఆ నిర్ణయాన్ని ట్రస్ట్స్‌ అంగీకరించాయని ఆయన వెల్లడించారు. అలాంటప్పుడు మళ్లీ ఆయన నియామకాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.

వివరాలు 

పదవి నుంచి తప్పుకోవాలనుకున్న చంద్రశేఖరన్‌..

చంద్రశేఖరన్‌ ఆగస్టు 12న తన పదవీకాలం ముగిసిన తర్వాత ఛైర్మన్‌గా కొనసాగేందుకు ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేశారు.

ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. అయితే గురువారం జరిగిన టాటా సన్స్‌ బోర్డు సమావేశంలో ఆయనను మరో ఐదేళ్లపాటు ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయంపైనే నోయెల్‌ టాటా ప్రశ్నలు లేవనెత్తారు. చంద్రశేఖరన్‌ పదవి నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం పూర్తిగా ఆయన స్వయంగా తీసుకున్నదేనని చెప్పారు.

బోర్డు ఆయనపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని, ఈ విషయంలో ఎలాంటి తీర్మానం కూడా చేయలేదని స్పష్టం చేశారు.

వివరాలు 

గత నిర్ణయాలను పక్కన పెట్టినట్టే..

చంద్రశేఖరన్‌ తప్పుకోవాలన్న నిర్ణయం బహిరంగంగా వెల్లడైన తర్వాత ఉద్యోగులు, రుణదాతలు, వ్యాపార భాగస్వాములు, మార్కెట్‌ వర్గాలు దానిని పరిగణనలోకి తీసుకున్నాయని నోయెల్‌ టాటా తెలిపారు.

ఆ నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్‌ కూడా అంగీకరించాయని చెప్పారు. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు సుమారు 66 శాతం వాటా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రశేఖరన్‌ను మళ్లీ ఛైర్మన్‌గా నియమించడం అంటే ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టినట్టేనని నోయెల్‌ అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు 

డైరెక్టర్‌ పదవిపై స్పష్టత లేకుండానే ఛైర్మన్‌ నియామకమా?

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి కంపెనీ డైరెక్టర్‌గా ఉండాల్సిన అవసరం ఉందని నోయెల్‌ టాటా మరో అంశాన్ని ప్రస్తావించారు.

అయితే చంద్రశేఖరన్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు.

చంద్రశేఖరన్‌ డైరెక్టర్‌ పదవిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమావేశం కోరం లేక వాయిదా పడిందని ఆయన గుర్తుచేశారు.

డైరెక్టర్‌ పదవిపై నిర్ణయం ఇంకా ఖరారు కాకముందే ఛైర్మన్‌గా కొనసాగించాలన్న నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని నోయెల్‌ పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని ఏదైనా వాటాదారు న్యాయపరంగా సవాల్‌ చేసే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు.

ADVERTISEMENT