NPPA: 1085 క్యాన్సర్ మందుల ధరల తగ్గింపు.. ఈనెల 9 నుంచి కొత్త ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
వివిధ బ్రాండ్లకు చెందిన 1,085 క్యాన్సర్ నిరోధక ఔషధాల గరిష్ఠ విక్రయ ధరలను సవరించినట్లు ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్‌పీపీఏ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ) మంగళవారం ప్రకటించింది. సవరించిన ధరలు ఈనెల 9 నుంచి అమల్లోకి రానున్నాయి. గత నెల 28న వివిధ బ్రాండ్లకు చెందిన 543 క్యాన్సర్ నిరోధక మందుల గరిష్ఠ విక్రయ ధరలను ఎన్‌పీపీఏ తగ్గించింది. తాజాగా ఈ జాబితాలో మరిన్ని ఔషధాలను చేర్చినట్లు సంస్థ వెల్లడించింది. ఈనెల 3 వరకు ఔషధ తయారీ కంపెనీలు సమర్పించిన ధరల వివరాలను తాజా జాబితాలో పొందుపరిచినట్లు తెలిపింది. షెడ్యూల్‌లో లేని క్యాన్సర్ నిరోధక ఔషధాల తయారీదారులు సవరించిన ధరలను సమర్పించినప్పుడల్లా ఈ జాబితాను ఎన్‌పీపీఏ నవీకరిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్యాన్సర్ ఔషధాల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
National Pharmaceutical Pricing Authority (NPPA) has released revised Maximum Retail Prices (MRPs) for 543 brands of anti-cancer medicines, effective from 9 November.
— All India Radio News (@airnewsalerts) October 29, 2026
The list will be updated as manufacturers submit revised prices of non-scheduled anti-cancer drugs.
Several… pic.twitter.com/X62jGBw1ye