Loading...
Nvidia Royal Family Culture: ఎన్విడియాలో రాజకుటుంబం తరహా పాలన.. జెన్సన్ హువాంగ్ స్టైల్ ఇదే!
ఎన్విడియాలో రాజకుటుంబం తరహా పాలన.. జెన్సన్ హువాంగ్ స్టైల్ ఇదే!

Nvidia Royal Family Culture: ఎన్విడియాలో రాజకుటుంబం తరహా పాలన.. జెన్సన్ హువాంగ్ స్టైల్ ఇదే!

వ్రాసిన వారు Balachander Sharma
Nov 17, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చిప్స్‌ రంగంలో అగ్రస్థానానికి చేరిన ఎన్విడియాలో జెన్సెన్‌ హువాంగ్‌ నాయకత్వ శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ (WSJ) కథనం ప్రకారం.. సంస్థలో క్రమశిక్షణ, కఠినమైన పనితీరు అంచనాలు, ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణకు పెద్దపీట ఉండేది. సాధారణంగా పెద్ద కంపెనీల్లో సీఈఓకు కొద్దిమంది కీలక అధికారులు మాత్రమే నేరుగా రిపోర్ట్‌ చేస్తారు. కానీ హువాంగ్‌కు దాదాపు 60 మంది నేరుగా రిపోర్ట్‌ చేసేవారు. దీనివల్ల ప్రతి విభాగంలోని కీలక నిర్ణయాలపై ఆయనకు ప్రత్యక్ష పట్టు ఉండేది.

Details

తప్పులకు తావులేని పని వాతావరణం

ఎన్విడియాలో పని చేయడం అంత సులభం కాదని మాజీ, ప్రస్తుత ఉద్యోగులు WSJకి వెల్లడించారు.

సమావేశాల్లో ఉద్యోగులు, ఉన్నతాధికారుల ఆలోచనలను హువాంగ్‌ నేరుగా ప్రశ్నించేవారని, కొన్నిసార్లు అందరి ముందే తీవ్రంగా విమర్శించేవారని తెలిపారు.

మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ రాబ్‌ సాంగర్‌ కూడా హువాంగ్‌ విమర్శించే తీరు గురించి ప్రస్తావించారు.

అయితే ఈ విధానం సంస్థలో నిజాయతీతో కూడిన అభిప్రాయాల మార్పిడికి, వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడిందని కొందరు భావించారు.

మరికొందరికి మాత్రం ఈ తరహా విమర్శలు ఒత్తిడిని కలిగించేవి.

Details

కుటుంబ సభ్యులకు కీలక బాధ్యతలు

ఈ సంస్థలో హువాంగ్‌ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ప్రత్యేకంగా కనిపించేది.

ఆయన కుమార్తె మాడిసన్‌ హువాంగ్‌ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌లో సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ రోబోటిక్స్‌, కమ్యూనికేషన్స్‌ విభాగాలతో అనుబంధంగా ఉన్నారు.

కుమారుడు స్పెన్సర్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా, అల్లుడు నికో కాప్రెజ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వహించారు.

కుటుంబ సభ్యులకు సీఈఓతో ఉన్న సాన్నిహిత్యం, సంస్థలో వారి ప్రభావం కారణంగా కొందరు ఉద్యోగులు వారిని అనధికారికంగా 'రాజకుటుంబం'గా అభివర్ణించేవారు.

ADVERTISEMENT

Details

ఒత్తిడితో పాటు వేడుకలకూ ప్రాధాన్యం

పని విషయంలో కఠినంగా ఉండే ఎన్విడియా, విజయాలను జరుపుకోవడంలోనూ వెనుకబడేది కాదు.

కీలక ఉత్పత్తుల విడుదల, వ్యాపార విజయాల సందర్భంగా భారీ వేడుకలు నిర్వహించేది. ఉద్యోగులతో కలిసి విందులు, వినోద కార్యక్రమాల్లో హువాంగ్‌ పాల్గొనేవారని WSJ కథనం పేర్కొంది.

ఇదిలా ఉండగా, నవంబర్‌ 12న హువాంగ్‌ సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో సంస్థ నాయకత్వంలో మార్పు వచ్చింది.

సీఎఫ్‌ఓ కోలెట్‌ క్రెస్‌ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టగా, హార్వీ సి. జోన్స్‌ బోర్డు తొలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

ఇప్పుడు హువాంగ్‌ తర్వాత ఎన్విడియా తన వేగాన్ని, ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఎలా కొనసాగిస్తుందన్నది పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT