Loading...
Nvidia: డిసెంబర్‌లో ఎన్విడియా ఉద్యోగులకు జీతాల పెంపు.. కొత్త సీఈఓ హామీ
డిసెంబర్‌లో ఎన్విడియా ఉద్యోగులకు జీతాల పెంపు.. కొత్త సీఈఓ హామీ

Nvidia: డిసెంబర్‌లో ఎన్విడియా ఉద్యోగులకు జీతాల పెంపు.. కొత్త సీఈఓ హామీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్విడియా (Nvidia) ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. డిసెంబర్‌లో జీతాలు పెంచడంతో పాటు అదనపు ఈక్విటీ వాటాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని సంస్థ తాత్కాలిక సీఈఓ కోలెట్ క్రెస్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. సాధారణంగా నిర్ణయించిన సమయం కంటే కొన్ని నెలల ముందుగానే ఈ పెంపులు అమలు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం నిర్వహించిన తన తొలి ఉద్యోగుల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి ఉద్యోగి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, జీతభత్యాల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

వివరాలు 

వేతనాల పెంపుపైనే ఉద్యోగుల నుంచి ఎక్కువ ప్రశ్నలు

వైర్డ్ (WIRED) కథనం ప్రకారం.. సమావేశానికి ముందు ఉద్యోగులు పంపిన 700 ప్రశ్నల్లో అత్యధికంగా జీతభత్యాలు, పరిహారానికి సంబంధించినవే ఉన్నాయి.

సంస్థ బోర్డు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని కూడా పలువురు ఉద్యోగులు కోరారు.

అయితే, జీతాలు ఎంత మేర పెంచుతారు? అదనంగా ఎన్ని ఈక్విటీ వాటాలు కేటాయిస్తారు? అనే విషయాలను మాత్రం యాజమాన్యం వెల్లడించలేదు.

వివరాలు 

జెన్సన్ హువాంగ్ రాజీనామా తర్వాత తొలి సమావేశం

ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా 33 ఏళ్లుగా సంస్థను నడిపించిన జెన్సన్ హువాంగ్ గత వారం తన పదవికి రాజీనామా చేశారు.

హువాంగ్ రాజీనామా తర్వాత కంపెనీ ఉద్యోగులందరితో తొలిసారిగా ఈ సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం ఎన్విడియాలో దాదాపు 49 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఆరోపణలు, చైనా నిఘా వర్గాలకు చెందిన వ్యక్తితో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు తెరపైకి రావడంతో హువాంగ్ రాజీనామా చేసినట్లు కథనాలు వెల్లడించాయి.

సంస్థ విధానాలు, నిబంధనలకు విరుద్ధమైన వ్యక్తిగత ప్రవర్తన గురించి హువాంగ్ స్వయంగా వెల్లడించినట్లు బోర్డు ఛైర్మన్ హార్వే జోన్స్ మంగళవారం తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

జెన్సన్ హువాంగ్ రాజీనామా తర్వాత తొలి సమావేశం

ఆయనను తిరిగి సంస్థలోకి తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

హువాంగ్ ప్రవర్తన, కొన్ని విషయాల్లో ఆయన నిజాయతీగా వ్యవహరించకపోవడం వల్లే రాజీనామాను బోర్డు ఆమోదించిందని జోన్స్ పేర్కొన్నట్లు వైర్డ్ తెలిపింది.

కొత్త సీఈఓ ఎంపికలో హువాంగ్ లాంటి వ్యక్తి కోసం వెతకడం లేదని జోన్స్ చెప్పారు.

ఇంజినీరింగ్ రంగంలో అనుభవం, వ్యూహాత్మక ఆలోచన, సంస్థ సంస్కృతికి సరిపోయే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి కావాలని తెలిపారు.

త్వరగా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రమాణాలను తగ్గించబోమని, కొత్త సీఈఓ ఎంపికలో ఉద్యోగుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

హువాంగ్‌ను తిరిగి తీసుకురావాలంటూ ఉద్యోగుల ఒత్తిడి

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించాలని వేలాది మంది ఎన్విడియా ఉద్యోగులు బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఇదే డిమాండ్‌తో ప్రారంభమైన ఒక ఆన్‌లైన్ పిటిషన్‌కు దాదాపు రెండు లక్షల మంది మద్దతు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.

పలువురు ప్రముఖ టెక్నాలజీ రంగ ప్రతినిధులు కూడా ఈ పిటిషన్‌పై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, కొత్త సీఈఓ కోసం సంస్థ అంతర్గతంగా, బయటి నుంచి కూడా అభ్యర్థులను పరిశీలిస్తోంది.

ఎలాన్ మస్క్ సైతం హువాంగ్‌ను తిరిగి తీసుకురావాలనే ప్రయత్నాలకు మద్దతు తెలిపినట్లు సమాచారం.

వివరాలు 

పెట్టుబడిదారుల్లో ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళన

హువాంగ్ వైదొలగడం, ఆయనతో పాటు సంస్థపై పలు ప్రభుత్వ సంస్థలు దర్యాప్తులు చేపట్టడం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమయ్యాయి.

అయితే, ఈ పరిణామాల మధ్య కూడా ఎన్విడియా మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది.

మార్కెట్ అంచనాలను మించిన ఆదాయాన్ని నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.

దీంతో బుధవారం కంపెనీ షేర్లు దాదాపు 5 శాతం పెరిగాయి.

వివరాలు 

పెట్టుబడిదారుల్లో ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళన

అయితే, సంస్థ ముందు ఇప్పుడు ప్రధానంగా రెండు సవాళ్లు కనిపిస్తున్నాయి.

హువాంగ్ నాయకత్వంలోనే కొనసాగాలని భావించిన ఉద్యోగులు ఆయన నిష్క్రమణతో ఇతర సంస్థలకు వెళ్లిపోతారా? కొత్త నాయకత్వం లేకుండా ఉన్న ఎన్విడియా వైపు కృత్రిమ మేధ (AI) చిప్‌ల రంగంలోని ప్రతిభావంతులు ఆకర్షితులవుతారా? అనే ప్రశ్నలు పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉద్యోగులను సంస్థలో కొనసాగించడం అత్యంత ముఖ్యమైన బాధ్యత అని కోలెట్ క్రెస్ పేర్కొన్నారు.

కంపెనీ ఆదాయ ఫలితాలపై నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విశ్లేషకుడి ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT