Loading...
Nvidia stock Crash: ఎన్విడియా షేర్లలో భారీ పతనం.. రూ.18 లక్షల కోట్ల నష్టం
ఎన్విడియా షేర్లలో భారీ పతనం.. రూ.18 లక్షల కోట్ల నష్టం

Nvidia stock Crash: ఎన్విడియా షేర్లలో భారీ పతనం.. రూ.18 లక్షల కోట్ల నష్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓ కంపెనీ అధినేత వ్యక్తిగత వ్యవహారాలు సంస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో నివిడియా (Nvidia) ఉదంతం మరోసారి చర్చకు తెచ్చింది. సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధం, గూఢచర్యానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే వార్తలు టెక్ రంగంలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్విడియా బోర్డు అంతర్గత విచారణ ప్రారంభించింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు లేదా కంపెనీ రహస్య సమాచారం బయటకు వెళ్లలేదని బోర్డు స్పష్టం చేసింది. అయినప్పటికీ మదుపర్లలో నెలకొన్న ఆందోళన మాత్రం తగ్గలేదు. దీంతో కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్విడియా షేరు ధర 4.27 శాతం క్షీణించి 178.67 డాలర్ల వద్ద స్థిరపడింది.

వివరాలు 

ఏఐ విప్లవంలో కీలక పాత్ర

అంతకుముందు ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒక దశలో 8 శాతానికి పైగా పతనమైంది. ఈ పరిణామంతో కంపెనీ మార్కెట్ విలువలో రూ.18 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది.

జెన్సన్ హువాంగ్ కేవలం ఎన్విడియా సీఈఓ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఈ నేపథ్యంలో ఆయనపై జరుగుతున్న విచారణ మరింత తీవ్రతరం అయితే, ఆయన పదవికి ముప్పు ఏర్పడుతుందనే ఆందోళన మదుపర్లలో నెలకొంది.

అదే జరిగితే కంపెనీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భయాలే షేర్ల విక్రయాలకు కారణమయ్యాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

ఏఐ రంగంలో పెట్టుబడుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి

మరోవైపు అంతర్గత విచారణ, ప్రభుత్వ దర్యాప్తు అంశాలతో పాటు ఏఐ రంగంలో పెట్టుబడుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి కూడా ఎన్విడియా షేర్లపై ప్రభావం చూపింది.

అమెరికాలో డెమోక్రాట్ల విజయంతో డేటా సెంటర్ల నిర్మాణం, వాటి విద్యుత్ వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రావొచ్చనే అంచనాలు మదుపర్ల ఆందోళనను మరింత పెంచాయి.

ఇప్పటికే ఏఐ రంగంలో కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

అయితే ఈ పెట్టుబడులు సమీప భవిష్యత్తులో ఆశించిన స్థాయిలో లాభాలను అందిస్తాయా? లేదా? అనే సందేహాలు కూడా మార్కెట్‌లో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి ఎన్విడియా షేర్ల పతనానికి కారణమయ్యాయి.

ADVERTISEMENT