ఇకపై ఖరీదైనవిగా మారనున్న ఆన్‌లైన్ చెల్లింపులు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక నోటీసులో, వాలెట్ లేదా కార్డ్‌ల వంటి ప్రీపెయిడ్ టూల్స్ ను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చేసే వ్యాపార లావాదేవీలపై ఇంటర్‌చేంజ్ ఫీజులను వసూలు చేయాలని సూచించిన తర్వాత ఆన్‌లైన్ చెల్లింపు మరింత ఖరీదైంది. ఇక నుండి రూ.20,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1.1% వరకు 'ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్' (PPI) ఫీజు ఉంటుంది. లావాదేవీని అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, అధికారం ఇవ్వడానికి అయ్యే ఖర్చును కవర్ చేయడానికి ఇంటర్‌చేంజ్ రుసుము ఉంటుంది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుంది. ఇది ఆన్‌లైన్ వ్యాపారులు, పెద్ద వ్యాపారులు, చిన్న ఆఫ్‌లైన్ వ్యాపారులకు చేసే లావాదేవీలకు వర్తిస్తుంది.
ఇంటర్‌చేంజ్ ఫీజులను వ్యాపారులు వాలెట్‌లకు చెల్లిస్తారు
బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ వ్యక్తి నుండి వ్యక్తికి, వ్యక్తి నుండి వ్యాపారికి చేసే లావాదేవీలకు సర్‌ఛార్జ్ వర్తించదు. ఇంధన స్టేషన్ల వ్యాపారులు UPI చెల్లింపులపై 0.5% వరకు తక్కువ ఇంటర్‌చేంజ్ ఫీజులకు అర్హులు. ఈ ధరలను సెప్టెంబర్ 30న NPCI సమీక్షిస్తుంది. ఇంటర్‌చేంజ్ ఫీజులను వ్యాపారులు వాలెట్‌లకు చెల్లిస్తారు. Rs.2,000 కంటే ఎక్కువ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. అందువల్ల, చిన్న వ్యాపారులు, దుకాణదారులపై ప్రభావం చూపే అవకాశం లేదు. అయితే, వ్యాపారుల నుండి వసూలు చేయబడిన సర్‌చార్జి వినియోగదారులు చెల్లిస్తారు. UPI అనేది 'ప్రజా ప్రయోజనాల కోసం' అని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి, బ్యాంక్-టు-బ్యాంక్ UPI లావాదేవీలు, అన్ని వ్యాపారి లావాదేవీలకు లావాదేవీ రుసుము ఉండే అవకాశం లేదు.