Loading...
Oracle layoffs:  ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్‌.. ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు మెయిల్స్
ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్‌.. ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు మెయిల్స్

Oracle layoffs:  ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్‌.. ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు మెయిల్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. లేఆఫ్‌ జాబితాలో ఉన్న ఉద్యోగులకు సోమవారం ఉదయం 6 గంటల నుంచే తొలగింపు మెయిల్స్‌ రావడం ప్రారంభమైంది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. కృత్రిమ మేధ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో టెక్‌ కంపెనీలు సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. సోమవారం నుంచే కొత్తదఫా కోతలు ఒరాకిల్‌లో సోమవారం నుంచి కొత్తదఫా ఉద్యోగాల కోతలు (Oracle Layoffs) ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తొలగింపులకు సంబంధించిన వివరాలను పలువురు ఉద్యోగులు లింక్డిన్, రెడిట్‌ వేదికలపై పోస్టులు చేస్తున్నారు. అయితే, ఈ దఫాలో ఎంతమందిని తొలగించారనే విషయంపై ఒరాకిల్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

వివరాలు 

డేటా సెంటర్లపై భారీగా పెట్టుబడులు

కృత్రిమ మేధ, క్లౌడ్‌ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ఒరాకిల్‌ తన డేటా సెంటర్‌ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోంది.

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మూలధన వ్యయం (Capital Expenditure) కింద సంస్థ 28.5 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ వ్యయం 8.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే ఏడాది వ్యవధిలో ఖర్చు మూడు రెట్లు పెరిగింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయ అంచనాను కూడా ఒరాకిల్‌ పెంచింది.

గతంలో 90 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసిన ఈ వ్యయాన్ని తాజాగా 95 బిలియన్‌ డాలర్లకు చేర్చింది.

వివరాలు 

ఏఐ వ్యాపారానికి డిమాండ్‌ ఉన్నా.. ఉద్యోగాల కోతలు

మరోవైపు ఒరాకిల్‌ ఏఐ వ్యాపారానికి గిరాకీ పెరుగుతోంది. ఈ త్రైమాసికంలో అదనంగా 30 బిలియన్‌ డాలర్ల విలువైన ఏఐ క్లౌడ్‌ కాంట్రాక్టులపై సంతకాలు చేసినట్లు సంస్థ వెల్లడించింది.

అయినప్పటికీ డేటా సెంటర్ల విస్తరణకు భారీగా ఖర్చు చేస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో వ్యయాలను నియంత్రించడం, వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థను పునర్వ్యవస్థీకరించడం వంటి చర్యల్లో భాగంగా ఉద్యోగాల కోతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

లేఆఫ్‌ మెయిల్‌లో ఉద్యోగులకు సంస్థ ఈ విధంగా తెలిపినట్లు సమాచారం: ''పూర్తి పరిశీలన అనంతరం, ఒరాకిల్‌ ప్రస్తుత వ్యాపార అవసరాలకు అనుగుణంగా మీ బాధ్యతను తొలగించాలని నిర్ణయించుకున్నాం. ఈ సంస్థలో ఇదే మీ చివరి రోజు. ఇంతకాలం మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు.''

ADVERTISEMENT

వివరాలు 

ఈ ఏడాదిలో ఇప్పటికే 20 వేలకు పైగా తొలగింపులు

ఒరాకిల్‌ ఈ ఏడాదిలో ఇప్పటికే 20 వేలకు పైగా ఉద్యోగాలను తొలగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఏఐ, క్లౌడ్‌ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. సంస్థల పునర్నిర్మాణం, వ్యయ నియంత్రణ చర్యల కారణంగా టెక్‌ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT