Loading...
Oracle layoffs: Oracle ఉద్యోగులకు షాక్.. 7,000-10,000 మందిపై లేఆఫ్స్‌ ప్రభావం?
Oracle ఉద్యోగులకు షాక్.. 7,000-10,000 మందిపై లేఆఫ్స్‌ ప్రభావం?

Oracle layoffs: Oracle ఉద్యోగులకు షాక్.. 7,000-10,000 మందిపై లేఆఫ్స్‌ ప్రభావం?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒరాకిల్'లో మరో విడత ఉద్యోగ కోతలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని Moneycontrol నివేదిక పేర్కొంది. ఇందులో భారత్‌లోని ఉద్యోగులు కూడా ఉండొచ్చని సమాచారం. కంపెనీ వివిధ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగానే ఈ తొలగింపులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక నిర్దిష్ట వ్యాపార విభాగం లేదా ఫంక్షన్‌ను మాత్రమే పునర్వ్యవస్థీకరించే చర్య కాదని, పలు విభాగాల్లో ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆయా టీమ్‌లకు తమ మొత్తం బడ్జెట్‌ను తగ్గించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మందిపై ప్రభావం?

ఉద్యోగ కోతల స్థాయి ఎంత ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

అయితే కంపెనీలోని ఉద్యోగుల మధ్య ఉన్న అంతర్గత అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Oracle భారత్‌లోని ఉద్యోగులపై దీని ప్రభావం ఎంత ఉంటుందనేది ప్రస్తుతానికి తెలియదు.

గత కొన్ని త్రైమాసికాల్లోనూ కంపెనీ భారీగా ఉద్యోగాలను తగ్గించింది. మే 31తో ముగిసిన 12 నెలల కాలంలో Oracle అధికారికంగా 21,000 ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.

వివరాలు 

ప్టెంబరు తొలి రెండు వారాల్లో తొలగింపులు?

తొలగింపులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై స్పష్టత లేకపోయినా.. సెప్టెంబరు మొదటి నుంచి మధ్య వారాల్లో చర్యలు ఉండొచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు.

దీంతో కంపెనీలో ఆందోళన పెరిగింది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు, అధిక వేతనాలు పొందుతున్న సిబ్బందిలో ఈ భయం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా ఉద్యోగ కోతల్లో ఈ వర్గానికి చెందిన ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు Oracle క్లౌడ్ మౌలిక వసతులు, కృత్రిమ మేధ (AI) రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది.

అదే సమయంలో ఖర్చులను నియంత్రించడంతో పాటు మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తోంది.

ADVERTISEMENT

వివారాలు 

బడ్జెట్ కోతల ఆధారంగానే ఉద్యోగాల తగ్గింపు?

ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఒక నిర్దిష్ట వ్యాపార విభాగం పునర్వ్యవస్థీకరణకు మాత్రమే పరిమితం కాకుండా.. మొత్తం కంపెనీ బడ్జెట్ తగ్గింపు లక్ష్యాల ఆధారంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఖర్చులను తగ్గించుకోవాలని మేనేజర్లు, టీమ్‌లకు సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.

దీంతో ఏ విభాగంలోని ఉద్యోగులపై ప్రభావం పడుతుందో తెలుసుకోవడం సిబ్బందికి కష్టంగా మారింది.

తుది జాబితాలో ఎవరెవరు ఉంటారు, తొలగింపులు ఎప్పుడు జరుగుతాయనే దానిపై మేనేజర్లకు కూడా పూర్తి సమాచారం లేదని తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

Oracle కార్యకలాపాల్లో భారత్ కీలకం

Oracle ప్రపంచవ్యాప్త కార్యకలాపాల్లో భారత్‌కు కీలక స్థానం ఉంది.

ఇక్కడ కంపెనీకి ఇంజినీరింగ్, క్లౌడ్, సాంకేతిక మద్దతు తదితర విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు.

విస్తృత స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తే భారత్‌లోని సిబ్బందిపైనా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. సెప్టెంబరు 11న Oracle త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో తాజా ఉద్యోగ కోతలపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT