Loading...
Pakistan imports: పాకిస్థాన్‌ నిషేధించినా.. భారత్‌ వస్తువుల కొనుగోళ్లలో 69% వృద్ధి
పాకిస్థాన్‌ నిషేధించినా.. భారత్‌ వస్తువుల కొనుగోళ్లలో 69% వృద్ధి

Pakistan imports: పాకిస్థాన్‌ నిషేధించినా.. భారత్‌ వస్తువుల కొనుగోళ్లలో 69% వృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య గతేడాది పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత అధికారికంగా వాణిజ్య ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు దిగుమతులు పెరిగాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ దిగుమతులు 69 శాతం పెరిగి రూ.5,876 కోట్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు ఎలాంటి ఎగుమతులు జరగడం లేదని ఈ నివేదిక పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకపక్షంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది.

వివరాలు 

రూ.83 వేల కోట్లకు చేరవచ్చని అంచనా..

భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే కొన్ని ఉత్పత్తులు నేరుగా కాకుండా ఇతర దేశాల మీదుగా అక్కడికి చేరుతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా మందులు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, రసాయనాలను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), సింగపూర్‌ వంటి దేశాల ద్వారా పాకిస్థాన్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారిక వాణిజ్య ఆంక్షలను తప్పించుకునేందుకు ఈ మార్గాలను ఉపయోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి అనధికారిక వాణిజ్యం ఏడాదికి 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83 వేల కోట్లకు పైగా) విలువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

రూ.83 వేల కోట్లకు చేరవచ్చని అంచనా..

ఇతర దేశాల మీదుగా వస్తువులను తరలించి, వాటి లేబుళ్లను మార్చడం వల్ల పాకిస్థాన్‌ కొనుగోలుదారులకు వాటి ధరలు పెరుగుతున్నాయి.

అయినప్పటికీ భారత ఉత్పత్తులకు అక్కడ డిమాండ్‌ కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య నేరుగా వాణిజ్యం తిరిగి ప్రారంభమైతే భారత ఎగుమతిదారులకు ప్రయోజనం కలగవచ్చని విశ్లేషిస్తున్నారు.

ADVERTISEMENT