Payments Bank Board: పేమెంట్స్ బ్యాంక్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ: పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్
పేటియం (Paytm) పేమెంట్స్ బ్యాంకు బోర్డు(Payments Bank Board)స్వతంత్ర కలిగిన సంస్థని నియంత్రణ నిర్వహణ సమస్యలను పరిష్కరించుకోగలిగిన సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని పేటీఎం సంస్థ సీఈవో విజయ శేఖర్ శర్మ(Vijay Sekhar Sharma)పేర్కొన్నారు. పేమెంట్స్ బ్యాంకు బోర్డుతో తనతో సహా ఓ సి ఎల్ లోని ఏ ఒక్కరూ ఎటువంటి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలను కలిగి లేరని ఆయన స్పష్టం చేశారు. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఓ సి ఎల్(OCL)ను పేటీఎమ్ గా పిలుస్తున్న సంగతి తెలిసిందే . పేమెంట్ బ్యాంక్ బోర్డు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనివారి శక్తి సామర్థ్యాల పై తమకు అపారమైన నమ్మకం ఉందని విజయ శేఖర్ శర్మ తెలిపారు.
పదవుల నుంచి వైదొలిగిన విజయ్ శేఖర్ శర్మ
ఈ ఏడాది జనవరి చివరిలో పేటీఎమ్ (Paytm) పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాలు లేదా డిజిటల్ వాలెట్లలో కొత్త డిపాజిట్లను స్వీకరించడాన్ని మార్చి నుంచి నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించిన సంగతి తెలిసిందే. పేటీఎంగా పిలిచే వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సంస్థలు పేమెంట్స్ బ్యాంక్ 49 శాతం 41% వాటాలను కలిగి ఉండగా విజయ శేఖర్ శర్మ 51% వాటాలను కలిగి ఉన్నారు. భారత రిజర్వు బ్యాంకు ఆదేశాలను అనుసరించి విజయ్ శేఖర్ శర్మ ఫిబ్రవరిలో పేమెంట్స్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బోర్డు మెంబర్ పదవుల నుంచి వై దొలిగారు.