LOADING...
RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్ 
4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్

RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్ 

వ్రాసిన వారు Stalin
Jul 17, 2023
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిటైర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉద్యోగుల పెన్షన్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నవంబర్ 1, 2017 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ప్రస్తుతం చేసిన పెన్షన్ సవరణ వర్తిస్తుంది ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ మేరకు గురువారం పెన్షన్‌ను పెంపుదలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పెన్షన్‌ను సవరించడం వల్ల రూ.100గా ఉన్న బేసిక్ పెన్షన్ రూ.163కు పెరుగుతుంది. పెరిగిన పెన్షన్‌ను మొత్తం జూన్ 2023 నుంచి చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అయితే జూన్ 2023కి ముందు కాలానికి బకాయిల చెల్లింపు జరగదని నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ వెల్లడించింది.

పెన్షన్

30,000 రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు ప్రయోజనం 

పెన్షన్ సవరణ కారణంగా 30,000 రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 16ఏళ్ల తర్వాత 2019లో చివరిసారిగా పెన్షన్‌ను సవరించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెన్షన్ పథకం 1995లో మొదటిసారిగా ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి కేవలం నాలుగు సార్లు మాత్రమే పెన్షన్‌ను సవరించారు. బ్యాంకుల మాదిరిగా కాకుండా, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌కు అనుగుణంగా ఆర్‍బీఐ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్‌ను అందుతోంది.