PepsiCo: పెప్సీకోలో భారీ లేఆఫ్‌లు.. వెయ్యి మంది ఉద్యోగులపై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
వ్యాపారం పెరిగినా లేఆఫ్‌లు తప్పడం లేదు. ప్రముఖ శీతలపానీయాల తయారీ సంస్థ పెప్సీకో (PepsiCo) తాజాగా 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఉత్తర అమెరికాలో వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడంతోపాటు,సంస్థలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి పెప్సీకో వ్యాపారం వృద్ధి బాటలోనే కొనసాగుతోంది. ఈ త్రైమాసికంలో ఐరోపా,మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లో కంపెనీ వ్యాపారం 5.41బిలియన్ డాలర్లకు చేరింది. అయినప్పటికీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించడం గమనార్హం. వ్యాపార విస్తరణతోపాటు కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచుకోవడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని సంస్థ తెలిపింది. 2025లో ఇలియాట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్(Elliott Investment Management)పెప్సీకోలో వాటాలు కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెప్సీకోలో 1,000 ఉద్యోగాలకు కోత
PepsiCo is cutting about 1,000 jobs across North America as the company tries to turn around lagging sales in its home market.
— CNBC (@CNBC) November 10, 2026
“We have a clear ambition for PepsiCo North America: to build a stronger, more future-fit business that delivers industry-leading growth,” Ram Krishnan,… pic.twitter.com/adHWMyeCM0