Loading...
Prestige Group IPO: ప్రెస్టీజ్‌ గ్రూప్‌ రూ.2,700 కోట్ల ఐపీఓకు బ్రేక్‌.. వాయిదా వేసిన కంపెనీ
ప్రెస్టీజ్‌ గ్రూప్‌ రూ.2,700 కోట్ల ఐపీఓకు బ్రేక్‌.. వాయిదా వేసిన కంపెనీ

Prestige Group IPO: ప్రెస్టీజ్‌ గ్రూప్‌ రూ.2,700 కోట్ల ఐపీఓకు బ్రేక్‌.. వాయిదా వేసిన కంపెనీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనిశ్చిత మార్కెట్‌ పరిస్థితులు, ఇతర కారణాల నేపథ్యంలో స్థిరాస్తి సంస్థ ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ తన హోటల్‌ వ్యాపారానికి సంబంధించిన తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ప్రణాళికను వాయిదా వేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ వెంచర్స్‌ లిమిటెడ్‌ (PHVL) ఐపీఓకు వచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు (DRHP) దాఖలు చేసింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.2,700 కోట్ల వరకు నిధులు సమీకరించాలని కంపెనీ అప్పట్లో ప్రణాళిక వేసింది. అయితే వ్యూహాత్మక కారణాలు, అనిశ్చిత మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని DRHPని ఉపసంహరించుకోవాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ నియంత్రణ సంస్థకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.

వివరాలు

ఐపీఓకు వస్తున్న కంపెనీలు ఇవే..

ఇదిలా ఉండగా.. కెనడాకు చెందిన పెట్టుబడి సంస్థ సీపీపీఐబీ తమ ఆతిథ్య రంగ విభాగంలో రూ.3,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆగస్టులో ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ వెల్లడించింది.

మరోవైపు పలు సంస్థలు ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి.

కోల్‌కతాకు చెందిన అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.1,800 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది.

జే ఇన్‌ఫ్రాటెక్‌ రూ.600 కోట్ల నిధుల సేకరణ కోసం ఐపీఓకు రాబోతోంది. అరేటి 22 లిమిటెడ్‌ రూ.440 కోట్ల ఐపీఓకు సిద్ధమైంది. ఈ రెండు సంస్థలు సెబీ వద్ద DRHP దాఖలు చేశాయి.

బాన్‌గంగా గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ రూ.720కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు రాబోతోంది.

వివరాలు

సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు

ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ.540 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) ద్వారా రూ.180 కోట్లు సమీకరించనుంది.

ఇందుకు సంబంధించి సెబీ వద్ద ముసాయిదా పత్రాలను సమర్పించింది. డియాన్‌ ఎనర్జీ కూడా ఐపీఓకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది.

ఈ సంస్థ 72 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అలాగే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS)లో ప్రమోటర్లు 20 లక్షల వరకు షేర్లను విక్రయించనున్నారు.

అయితే ధరల శ్రేణి, ఇష్యూ తేదీలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.

ఇక విశాల్‌ నిర్మితి రూ.178 కోట్ల ఐపీఓ ఈ నెల 30న ప్రారంభమై అక్టోబరు 5న ముగియనుంది. ఈ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.208-220గా నిర్ణయించారు.

ADVERTISEMENT