Loading...
Stalin: ఇప్పటికీ యాక్టింగ్ మోడ్‌లోనే ఉన్నారు.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు!
ఇప్పటికీ యాక్టింగ్ మోడ్‌లోనే ఉన్నారు.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు!

Stalin: ఇప్పటికీ యాక్టింగ్ మోడ్‌లోనే ఉన్నారు.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2026
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ (C. Joseph Vijay) సినిమాలు చేయడం మానేశానని చెబుతున్నప్పటికీ.. ప్రజల ముందు మాత్రం ఇంకా నటిస్తూనే ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (M.K. Stalin) విమర్శించారు. మదురాంతకం అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో విజయ్ చేసిన ప్రసంగాన్ని తాను చూశానని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. విజయ్ తన ప్రచారంలో టీవీకేను 'స్వచ్ఛమైన శక్తి', డీఎంకేను 'దుష్ట శక్తి'గా అభివర్ణించిన వ్యాఖ్యలను స్టాలిన్ ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. టీవీకే అభ్యర్థిగా మాజీ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే మారగతం కుమారవేల్‌ను బరిలోకి దించడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.

వివరాలు

'విజయ్ పాలనలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది'

విజయ్ పాలనలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని స్టాలిన్ విమర్శించారు.

ఒకవైపు అన్నాడీఎంకే (AIADMK), ఎన్డీయే కూటమికి చెందిన నాయకులను తమ పార్టీలోకి తీసుకుంటూ.. మరోవైపు తన టీవీకేను 'స్వచ్ఛమైన శక్తి'గా అభివర్ణించుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

అలాగే డీఎంకే అమలు చేసిన పథకాలకే పేర్లు మార్చి టీవీకే అమలు చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు.

విద్యుత్ కోతలు, ధరల పెరుగుదల, పాల కొరత, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ తీరు గందరగోళంగా ఉందని విమర్శించారు.

వివరాలు

వీరమణి పోక్సో కేసుపై ఆరోపణలను ఖండించిన స్టాలిన్

జెమ్ గ్రానైట్స్ ఛైర్మన్ ఆర్. వీరమణికి సంబంధించిన పోక్సో కేసు విషయంలో డీఎంకేపై విజయ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్టాలిన్ పేర్కొన్నారు.

ఈ అంశంపై అసెంబ్లీలో ఇప్పటికే తన వైఖరిని స్పష్టంగా వివరించానని తెలిపారు. దర్యాప్తు అంశాలను రాజకీయంగా ఉపయోగించుకోవద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని స్టాలిన్ పేర్కొన్నారు.

అయినప్పటికీ విజయ్ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.

విజయ్ ముఖ్యమంత్రి హోదాకు తగిన విధంగా రాజకీయ సంయమనం పాటించాలని.. ప్రజల ముందు ఇలా నటించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT