Page Loader
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా, సౌత్ ఏషియా చీఫ్ పునీత్ చందోక్ రాజీనామా 
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా, సౌత్ ఏషియా చీఫ్ పునీత్ చందోక్ రాజీనామా

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా, సౌత్ ఏషియా చీఫ్ పునీత్ చందోక్ రాజీనామా 

వ్రాసిన వారు Stalin
Jun 02, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం, దక్షిణాసియా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వాణిజ్య వ్యాపార ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తన పదవులకు రాజీనామా చేశారు. ఆగస్టు 31నుంచి కంపెనీ నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం ఏడబ్ల్యూఎస్ ఇండియా, దక్షిణాసియాలో ఎంటర్‌ప్రైజ్, మిడ్-మార్కెట్, గ్లోబల్ బిజినెస్‌కు అధిపతిగా ఉన్న వైశాలి కస్తూరే తాత్కాలిక హెడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కంపెనీ 2030నాటికి భారతదేశంలో 12.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన ప్రకటించిన కొద్ది రోజులకే పునీత్ చందోక్ రాజీనామా చేయడం గమనార్హం. పునీత్ చందోక్ ఎందుకు రాజీనామా చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ఆయన మరో సంస్థలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పునీత్ చందోక్ 2019లో నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

2019 నుంచి ఏడబ్ల్యూఎస్‌లో పనిచేస్తున్న పునీత్